Don't Miss!
- Sports సూపర్ సండే: సునామీ సన్‌రైజర్స్‌ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- News గంటాకు సీటు ఖరారు - టీడీపీ తుది జాబితా విడుదల, లిస్టులో..!!
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్‌లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్‌ప్రైడే రోజున లాంగ్‌వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్‌లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
షాకింగ్: పాప్ స్టార్ లేడీ గాగాపై రేప్ జరిగింది
లాస్ ఏంజిల్స్: పాప్ సెన్సేషన్ లేడీ గాగా చాలా కాలం తర్వాత ఓ షాకింగ్ విషయం బయట పెట్టారు. తాను 19 సంవత్సరాల వయసులు ఉన్నపుడు తనపై రేప్ జరిగిందని, ఆ భయంకరమైన సంఘటన నుండి తేరుకోవడానికి ఎమోషన్ థెరపీ తీసుకున్నానని లేడీ గాగా చెప్పుకొచ్చారు.
హోవర్డ్ స్టెర్న్ షోలో ఇంటర్య్వూలో పాల్గొన్న 29 ఏళ్ల లేడీ గాగా ఈ విషయం వెల్లడించారు. ‘19 ఏళ్ల వయసున్నపుడు నాపై రేప్ జరిగింది. నాకంటే 20 ఏళ్లు పెద్దవాడైన ఓ వ్యక్తి నాపై ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన వల్ల కలిగిన షాక్ నుండి తేరుకోవడానికి ఎమోషన్ థెరపీ, మెంటల్ థెరపీ, ఫిజికల్ థెరపీ కూడా తీసుకున్నాను. ఆ సమయంలో నేను కాథలిక్ స్కూల్ లో చదువుకుంటున్నాను' అని లేడీగాగా తెలిపారు.
ఇంతకాలం ఈ విషయాన్ని బయటి ప్రపంచానికి తెలియకుండా గుట్టుగా ఉంచిన లేడీగాగా హోవర్డ్ స్టెర్న్ షో ఇంటర్వ్యూలో వెల్లడించడంతో ఫ్యాన్స్ షాకయ్యారు.
లేడీ గాగా గురించిన విషయాల్లోకి వెళితే...ఇంటర్నేషనల్ పాప్ సంగీత ప్రపంచంలో లేడీ గాగా ఓ సంచలనం. అందరిలా కాకుండా.... ఇతరులకు పూర్తి భిన్నంగా, తనకంటూ ప్యతేకంగా, అవసరం అయితే అగ్లీ అవతారాల్లో సైతం కనిపించడం లేడీ గాగా ప్రత్యేకత. స్టేజీ షోలు, వివిధ కార్యక్రమాలకు హాజరయ్యే క్రమంలో ఆమె వేషధారణ, దుస్తువులు ఎవరూ ఊహించని విధంగా ఉంటాయి. ఒక్కోసారి ఆమె లుక్ చూసే వారికి వాంతికొచ్చే విధంగా ఉంటాయి. ఈ ప్రత్యేకతే ఆమెను పాపులర్ స్టార్‌ను చేసాయి. ఆమె వేషధారణ ఎంత డిఫరెంటుగా ఉంటుందో...ఆమె ఆల్బమ్స్ కూడా అంతే ప్రత్యేకంగా ఉంటాయి.