ట్విట్టర్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన సింగర్
ప్రముఖ హాలీవుడ్ సింగర్ లేడిగాగా మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్‌లో ప్రపంచ రికార్డుని నెలకొల్పారు. మొన్నటి మొన్న పాప్ సింగర్ జస్టిన్ బైబర్ తన ట్విట్టర్ ఎకౌంట్లో 16 మిలియన్ల మంది ఫాలో అవుతుండడంతో నెంబర్ వన్ స్దానంలో కొనసాగారు. కానీ ఇప్పడు ఆ రికార్డుని బ్రేక్ చేస్తూ లేడిగాగా ట్విట్టర్‌లో ఓ సరిక్రొత్త రికార్డుని సృష్టించారు.
ఇంతకీ లేడిగాగా సృష్టించిన ఆ ప్రపంచ రికార్డు ఏమిటంటే లేడిగాగా మైక్రో బ్లాగింగ్ ఎకౌంట్ ట్విట్టర్‌ని 18 మిలియన్ల ఫాలోవర్స్ ఫాలో అవ్వడమే. 'ఫోకర్ ఫేస్' సిగంర్ అయిన లేడిగాగా ఈ విషయాన్ని సోమవారం తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా అభిమానులకు తెలియజేశారు. లేడిగాగా తన ట్విట్టర్ ఎకౌంట్‌లో ఈ క్రింది విధంగా పోస్ట్ చేశారు.
లేడిగాగా ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన సమాచారం తెలుగులో నిజంగా, నేను 18.000.000 TwitterMonsters కలిగి ఉన్నాననే విషయం నమ్మ శక్యంగా లేదని అన్నారు. ట్విట్టర్ ఎకౌంట్లో 18 మిలియన్ల ఫాలోవర్స్‌తో లేడిగాగ మొదటి స్దానంలో నిలవగా, 16 మిలియన్ల ఫాలోవర్స్‌తో సింగర్ జస్టిన్ బైబర్ రెండవ స్దానంలో ఉన్నారు. ఇక మూడవ స్దానంలో 13.9 మిలియన్ల ఫాలోవర్స్‌తో కాటీ పెర్రీ ఉన్నారు.
సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌లో సింగర్ లేడిగాగాను 46 మిలియన్ల అభిమానులు ఫాలో అవుతున్నారు.


Click it and Unblock the Notifications











