డ్యూయట్ సాంగ్‌తో ఆస్కార్ బరిలో హాల్ చల్
లేడిగాగా పాప్ మ్యూజిక్‌కి సరిక్రొత్త భాష్యం చెప్పిన వ్యక్తి. మైఖెల్ జాక్సన్ తర్వాత అతని స్దానం కోసం పోటీ పడుతున్న వ్యక్తులలో లేడిగాగాని ఒకరిగా అభివర్ణించవచ్చు. అలాంటి లేడిగాగా రూపొందించిన 'హాలో.. హాలో' డ్యూయట్ సాంగ్ 2012వ సంవత్సారనికి గాను ఆస్కార్ నామినేషన్ బరిలో నిలించింది. ఈ సాంగ్‌లో లేడిగాగాతో పాటు సర్ ఎల్టాన్ జాన్ కూడా కనిపిస్తారు.
ఈ సాంగ్‌ని లేడిగాగా రాకెట్ మ్యాన్స్ గ్నోమ్మియో అండ్ జూలియట్ అనే సినిమా నుండి తీసుకోవడం జరిగింది. మొత్తం ఆస్కార్ బరిలో 39 సాంగ్స్ నిలవడం జరిగింది. 2012 అకాడమీ అవార్డ్స్‌ని అత్యంత వైభవంగా త్వరలో జరపనున్నారు. ఈ 39 సాంగ్స్‌లలో ఏ సాంగ్ అకాడమీ అవార్డుని సొంతం చేసుకుందనే విషయాన్ని జనవరి 24న ఐదుగురు సభ్యులు కలిగిన జ్యూరీ కమిటీ నిర్ణయిస్తుంది.
నామినేషన్స్ విభాగంలో మేరీ జె బ్లిగీ ట్రాక్‌తో పాటు, విలియమ్స్ హాట్ వింగ్స్, రాబీ విలియమ్స్, బ్రాడ్ ప్రైస్లీ డ్యూయట్ కోలిజన్ మొదలగునవి ఉన్నాయి.


Click it and Unblock the Notifications











