»   » కంపు కొట్టే అవతారంలో సెక్సీ బ్యూటీ (ఫోటోలు)

కంపు కొట్టే అవతారంలో సెక్సీ బ్యూటీ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్ : ఇంటర్నేషనల్ పాప్ స్టార్ లేడీ గాగా గురించి ఇంగ్లీష్ పాప్ సంగీత ప్రియులకు కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. అందరిలా ఉంటే తనను గుర్తించేది ఎవరు? అనుకుందో ఏమో అందంగా కాకుండా అగ్లీ అవతారాల్లో డిఫరెంటు డ్రెస్సింగుతో కనిపించడం లేడీ గాగా ప్రత్యేకత.

స్టేజీ షోలు, వివిధ కార్యక్రమాలకు హాజరయ్యే క్రమంలో ఆమె వేషధారణ, దుస్తువులు ఎవరూ ఊహించని విధంగా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే చూసే వారికి వాంతికొచ్చే విధంగా ఉంటాయి. ఈ ప్రత్యేకతే ఆమెను పాపులర్ స్టార్‌ను చేసాయి. ఆమె వేషధారణ ఎంత డిఫరెంటుగా ఉంటుందో...ఆమె ఆల్బమ్స్ కూడా అంతే ప్రత్యేకంగా ఉంటాయి.

అప్పుడప్పుడు ఆమె పబ్లిక్‌లోకి డిఫరెంటుగా ఎంట్రీ ఇస్తుంటుంది. ఆమె ఏ దుస్తులు వేసుకుంటే వాటిని, ఏ రంగు లిప్‌స్టిక్ వాడితే దాన్ని వాడుతూ గాగా ట్రెండ్‌ను ఫాలో అయ్యే వెర్రి జనాలు చాలామందే ఉన్నారు. అందుకే ఆమె ఎక్కడికెళ్లినా మీడియా కెమెరాలు ఆమెను వెంటాడుతూ ఉంటాయి. ఇటీవల లేడీ గాగా కేవలం బ్రా వేసుకుని రోడ్డెక్కింది. టాప్ సెలబ్రిటీ బ్రాతో రావడంతో సర్వత్రా చర్చనీయాంశం అయింది.

స్లైడ్‌షోలో లేడీ గాగా డిఫరెంట్ అవతార్స్...

లేడీగాగా నేచురల్ అవతార్

లేడీగాగా నేచురల్ అవతార్


ఇటీవల లేడీ గాగా ఎలాంటి మేకప్ లేకుండా తన సహజమైన అవతారంలో ఫోటోకు ఫోజిచ్చింది. ఈ అవతారం చూసి కొంత మంది అభిమానులు షాకయ్యారు. ఇలా అభిమానులకు తన సహస్వరూపం చూపించడానికి ఎంత మంది స్టార్స్ సాహసం చేస్తారు చెప్పండి.

మగాడి అవతారంలో...

మగాడి అవతారంలో...


2011లో తన మ్యూజిక్ ఆల్బం విడుదల సందర్భంగా ఇలా మగాడి అవతారంలో దర్శనం ఇచ్చింది లేడీ గాగా. కేవలం మగాడిలా తయారవడే కాదు...మగాళ్లు వాడే రెస్ట్ రూమ్‌నే వాడి సంచలనం సృష్టించింది. ఇలా లేడీగాగా వాంతికొచ్చే అవతారం చూసి అంతా విస్తుపోయారు.

బుడగల డ్రెస్‌లో లేడీ గాగా

బుడగల డ్రెస్‌లో లేడీ గాగా


లేడీ గాగా తన తొలి ఆల్బం ‘ది ఫేమ్' ప్రమోషన్లో భాగంగా ఇలా బుడగల డ్రెస్ వేసి అందరినీ ఆకర్షించింది. ఆమె ధరించిన ఈ బుడగల డ్రెస్ ప్రత్యేకంగా ప్లాస్టిక్ బుడగలతో తయారు చేసారు. ఈ డ్రెస్ ఆమెకు మంచి పబ్లిసిటీ తెచ్చిపెట్టింది.

మాంసంతో తయారు చేసిన డ్రెస్‌లో

మాంసంతో తయారు చేసిన డ్రెస్‌లో


పచ్చిమాంసంతో తయారు చేసిన ఈ డ్రెస్‌ను 2010లో ఎంటీవీ వీడియో మ్యూజిక్ అవార్డ్స్ సందర్భంగా ధరించి అందరినీ షాక్‌కు గురి చేసింది లేడీ గాగా. ఈ డ్రెస్ వేసుకున్న ఆమెపై పలువురు జంతు ప్రేమికులు నిరసన వ్యక్తం చేసారు.

ఆర్బిట్ డ్రెస్‌లో...

ఆర్బిట్ డ్రెస్‌లో...


లేడీ గాగా రియల్ నేమ్ ‘స్టెఫానీ జాన్నె ఏంజలీనా జెర్మనోట్టా'. 52వ గ్రామీ అవార్డ్స్‌కు హాజరైన సందర్భంగా లేడీ గాగా ఇలా దర్శనం ఇచ్చింది. దీన్ని స్పేస్ ఆర్బిట్ డ్రెస్ అంటూ అప్పట్లో మీడియా తెగ ప్రచారం చేసింది.

వాంతికొచ్చే అవతారం?

వాంతికొచ్చే అవతారం?


చూస్తేనే వాంటికొచ్చేలా ఉందంటూ లేడీ గాగాను ఇలా చూసిన వారు అభిప్రాయ పడ్డారు. 2011లో విడుదలైన చేసిన ‘బార్న్ దిస్ వే' ఆల్బంలో ఈ డ్రెస్సులో దర్శనం ఇచ్చింది లేడీ గాగా. ఈ అవతారం చాలా చెత్తగా ఉంది కదూ...

బ్లూ హెయిర్‌తో

బ్లూ హెయిర్‌తో


ప్రత్యేకంగా కనిపించడం కోసం లేడీ గాగా ఎలాంటి మేకప్ వేసుకోవడానికైనా వెనకాడదు. అందుకు నిదర్శనమే ఇక్కడ కనిపిస్తున్న ఫోటో. నీలి రంగం కేశాలంకరణకు తోడు ఆమె డ్రెస్ ఎంత వరస్ట్‌గా ఉందో కదూ. ఇలాంటి వేషధారణను ఇష్ట పడే వారు కూడా ఉన్నారు.

బ్రిటన్ రాణిని కలిసిన వేళ...

బ్రిటన్ రాణిని కలిసిన వేళ...


ఇంగ్లండ్ రాణి ఎలిజబెత్ 2ను కలిసిన సందర్భంగా లేడీ గాగా ఓ ప్రత్యేకమైన అవతారంలో దర్శనం ఇచ్చింది. ఎరుపురంగు ఔట్ ఫిట్‌తో కళ్లకు ఎరుపు రంగు మాస్క్‌ను తలపించే విధంగా డిజైన్ చేసారు. ఈ డ్రెస్ ఎలా ఉందో మీరే ఊహించుకోండి.

లేడీ గాగా ప్లాస్టిక్ లుక్

లేడీ గాగా ప్లాస్టిక్ లుక్


న్యూడిటీకి అద్దం పట్టే విధంగా, వింతగా ఉన్న ఈ ప్లాస్టిక్ డ్రెస్ లేడీ గాగాకు మీడియాలో బాగా ప్రచారం కల్పించింది. ఈ డ్రెస్ చాలా చెత్తగా ఉన్నప్పటికీ ఆమె అభిమానులు మాత్రం డిఫెంటుగా ఉందంటూ కితాబిచ్చేసారు.

చీరకట్టులో లేడీ గాగా

చీరకట్టులో లేడీ గాగా


ఓ సారి లేడీ గాగా భారతీయ సాంప్రదాయంలో చీరకట్టులో దర్శనం ఇచ్చింది. ఈ చీరను ఇండియన్ సారీ డిజైనర్ తరుణ్ తహిలియానీ డిజైన్ చేసారు. ఈ చీరకట్టులో ఆమె ఎంతో బాగుందని ప్రశంసించారు ఇండియాలోని గాగా అభిమానులు.

గ్రాహమ్ నార్తన్ షోలో గాగా ఇలా...

గ్రాహమ్ నార్తన్ షోలో గాగా ఇలా...


గ్రాహమ్ నార్తన్ షో సందర్భంగా లేడీ గాగా ఇలా డిఫరెంటు అవతారంలో దర్శనం ఇచ్చారు. ఇక్కడ ఆమె మేకప్ కూడా డిఫరెంటుగా ఉండటంతో ఇంటర్నేషనల్ మీడియాలో చర్చనీయాంశం అయింది. అయితే ఆమె వేషధారణ కొందరికి మాత్రమే నచ్చింది.

చేపల వల మాదిరి డ్రెస్‌లో

చేపల వల మాదిరి డ్రెస్‌లో


2012 గ్రామీ అవార్డుల కార్యక్రమం సందర్భంగా లేడీ గాగా ఇలా డిఫరెంటు అవతారంలో దర్శనం ఇచ్చింది. ఆమె అందాలను బహిర్గతం చేసేలా సెక్సీగా ఉన్నప్పటి....చెత్త డ్రెస్ అనే పేరు మూటగట్టుకుంది లేడీ గాగా.

కప్పబొమ్మల డ్రెస్

కప్పబొమ్మల డ్రెస్


కప్పలంటేనే చాలా మందికి అసహ్యం. అలాంటిది కప్పబొమ్మలతో కూడిన డ్రెస్ అంటే ఒంకెత చెండాలంగా ఉంటుంది. 2009లో ఓ జర్మన్ టీవీ ఇంటర్వ్యూలో లేడీ గాగా ఇలా దర్శనం ఇచ్చింది. ఈ అవతారం చూసి అంతా స్టన్నయిపోయారు.

వోగ్ మేగజైన్‌పై లేడీ గాగా ఇలా...

వోగ్ మేగజైన్‌పై లేడీ గాగా ఇలా...


వోగ్ మేజగైన్ అంటేనే సెక్సీ భామాల ఫోటో షూట్లకు పెట్టింది పేరు. మరి లేడీగా మాత్రం ఇలా డిఫరెంటు లుక్‌తో, చెత్త డ్రెస్సింగుతో దర్శనం ఇచ్చింది. ఇలా చేయడం గాగాకు కొత్తమే కాదుకదా అని అంతా సరిపోట్టుకున్నారు.

English summary
Lady Gaga who is known for coming up with different avatars quite often, now bares it all by posing nude for a US fashion magazine. The pop star covered her private areas with her hands. She sports this svelte new look with bushy blonde hair. The 27-year-old has posed a make-up free face for the photograph for magazine V.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu