»   » నాఅభిమానులు తలఎత్తుకునే విధంగా ఉంటుంది ఈఆల్బమ్..

నాఅభిమానులు తలఎత్తుకునే విధంగా ఉంటుంది ఈఆల్బమ్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

లేడిగాగా ప్రపంచంలోకెల్లా అత్యుత్తమమైన స్టేజి ఫెర్పామర్. ఇదినిజం అని తెలియడానికి ఇటీవల జరిగిన యమ్ టివి మ్యూజిక్ అవార్డులే అందుకు నిదర్శనం. పాప్ ప్రపంచానికి రారాజు మైఖెల్ జాక్సన్ తర్వాత పాప్ అభిమానులు ఎక్కువగా కలిగిన పాప్ స్ట్రార్ లేడిగాగా రూపోందించినటువంటి రెండవ ఆల్బమ్ 'బార్న్ దిస్ వే' ఈదశాబ్దపు ఉత్తమ ఆల్బమ్ గానిలుస్తుందని అన్నారు. ప్రస్తుతం మోనెస్టర్ బాల్ టూర్ లోఉన్న లేడీగాగా ఈఆల్బమ్ పైతనదైన శైలిలో స్పందించారు. లేడీగాగా మాట్లాడుతూ నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను. నాఅభిమానులైన మిమ్మల్ని ఎప్పుడూ తలఎత్తుకునే విధంగానే ఉంటాయి నాఆల్బమ్స్ అన్నారు. ఈఆల్బమ్ చాలా సూపర్ గావచ్చిందని అన్నారు.

ఇందులో ఏమున్నాయనేది కాదు. నాఅభిమానులు ఈఆల్బమ్ నిఎంతగా ఆస్వాదిస్తున్నారనేది నాకు ముఖ్యం. ఈఆల్బమ్ మీకోసమే తయారుచేస్తున్నాను. ఇక్కడ మీకోక విషయం చెప్పాలి. చాలా మంది పాప్ మ్యూజిక్ ప్రీడమ్ నుతగ్గంచడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్శ దృష్టిలో ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ఫ్రీగా ఉందని అనుకుంటున్నారు. కాని ప్రస్తుతం ఉన్న సోసైటీలో మనకంటూ మనం ఒక ఐడెంటిటీని కల్పించుకోవాలి. ఆఐడెంటిటీని ఎలా కల్పించుకుంటామనేదే ఈ బార్న్ దిస్ వే ఆల్బమ్ లోచూపించడం జరుగుతుందని అన్నారు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే రాత్రి పూట భయాన్నిపోగోట్టడానికి మన దగ్గర ఏమి ఉంచుకోవాలనేది సారాంశం అని అన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu