క్రియేటివ్ డైరెక్టర్‌తో విడిపోవడం బాధాకరం
లేడిగాగా ఇటీవల ఇండియాలో జరిగిన ఫార్ములా వన్ రేసు కార్యక్రమానికి వచ్చిన అతిధులకు రాత్రిపూట తన ఆటపాటలతో ఊరూత్తలూగించిన పాప్ స్టార్. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నుండి చాలా ప్రముఖలు హాజరైన విషయం తెలిసిందే. ఫార్ములా వన్ రేసుని వీక్షించేందుకు వచ్చిన సెలబ్రిటీల కొసం గాగా ప్రత్యేకంగా తన షో ని చేయడం జరిగింది.
పాటలతో అలరించి ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న లేడిగాగా గత కొన్ని సంవత్సరాలుగా తనతో కలసి ఉన్న క్రియేటివ్ డైరెక్టర్ గిబ్సన్ నుండి విడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా లేడిగాగా తెలియజేయడం విశేషం. వీరిద్దరి మద్య ఉన్న బంధం ఈనాటికి కాదు. దాదాపు లేడిగాగా ఇంటర్‌స్కోప్ రికార్డులకు సంతకం చేసినప్పటి నుండి గాగాకి తన అమూల్యమైన సలహాలను అందిస్తూ గాగా తొడ్పాటుకు ఎంతగానో కృషి చేయడం జరిగింది.
అలాంటి క్రియేటివ్ డైరెక్టర్ నుండి సడన్‌గా గాగా విడిపోవడానికి కారణాలు ఏమై ఉంటాయని హాలీవుడ్ ప్రేక్షాభిమానులు చెవులు కొరుక్కుంటున్నారు. ప్రస్తుతం లేడిగాగా, గిబ్సన్ కలసి చేస్తున్నటువంటి వీడియో సాంగ్ 'యూ అండ్ ఐ' వీరిద్దరి కలయికలో చివరది అవుతుందని అంటున్నారు. చివరగా గాగా మాట్లాడుతూ మేమిద్దరం విడిపోవడానికి గల కారణాలను దయచేసి అడగవద్దని, దానిపై మాట్లాడడానికి నిరాకరించారు.


Click it and Unblock the Notifications











