ఓక్ బార్ లో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరచిన హీరోయిన్..!
ఇటీవల జరిగిన యమ్ టివి వీడియో మ్యూజిక్ అవార్డులలో బెస్ట్ ఫీమెల్ అవార్డు తీసుకున్న లేడిగాగా మాన్ హాట్టన్ లో ఉన్న తన అభిమానులకు సడన్ గా పెద్ద షాక్ ఇచ్చారు. మాన్ హాట్టన్ లో ప్లాజా హొటల్ లో కనిపించి తన పాప్ మ్యూజిక్ అందరిని కాసేపు తెలియాడేట్టు చేశారు. ప్లాజా హొటల్ లోని ఓక్ రూమ్ బార్ లో ఈ వ్యవహారం జరిగింది. ఈ విషయాన్ని హొటల్ యజమానులు ఇంకొద్ది సేపట్లో లేడి గాగా షో మొదలవుతుందనే సమయంలో ఈ విషయాన్నిప్రకటించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. లేడిగాగా వాళ్శ గ్రాండ్ ఫాదర్ చనిపోయిన తర్వాత గాగా ఇచ్చినటువంటి మొట్టమొదటి షోగా హొటల్ యజమానులు వివరించారు. ఈ హొటల్ బార్ లో లేడిగాగా షో ఉందని హొటల్ యజమానులు చాలా సీక్రెట్ ఉంచడం జరిగిందన్నారు.
ఈ షోలో లేడిగాగా ధరించినటువంటి డ్రస్సు చాలా వెరైటీగా ఫోను రూపంలో ఉందని ఆమె అభిమానులు అందరూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. లేడిగాగా జీవితంలో అతికొద్దిమంది అభిమానుల సమక్షంలో జరగడం ఇదే మొదటిసారని అన్నారు.


Click it and Unblock the Notifications











