త్వరలో బాలీవుడ్‌లో నటిస్తానంటున్న పాప్ రాణి
మైఖెల్ జాక్సన్ చనిపోయిన తర్వాత పాప్ మ్యూజిక్‌ని ఓ ఆట ఆడిస్తున్న స్టార్ లేడిగాగా. ఎప్పుడూ పాప్ మ్యూజిక్‌తో విసిగిపోయినటువంటి లేడిగాగా త్వరలో సినిమాలలోకి ప్రవేశనుందని సమాచారం. ఇంతకీ లేడిగాగా ఏ సినిమాల మీద ఆసక్తి చూపుతుందే తెలిస్తే అందరం అవాక్కు అవుతాం. లేడిగాగాకి ఈ మద్య కాలంలో బాలీవుడ్ సినిమాల మీద బాగా ఆసక్తి రావడంతో బాలీవుడ్ సినిమాలు చూడడం మొదలు పెట్టడమే కాకుండా రాబోయే కాలంలో బాలీవుడ్‌లో ఓ సినిమాలో నటించాలని నిర్ణయం కూడా తీసుకుందని సమాచారం.
తనని ఎవరైనా ప్రోడ్యూసర్స్ తమ సినిమాలో నటించమని అడిగితే తప్పకుండా అందులో ఓ పాటకి డాన్సులో కనిపిస్తానని తెలిపారు. పేపరుతో లేడిగాగా మాట్లాడుతూ నేను ఇటీవల కాలంలో చాలా బాలీవుడ్ సినిమాలు చూశాను. స్టోరీ పరంగా చాలా సినిమాలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. బాలీవుడ్‌లో చాలా సినిమాలు ఫాంటసీతో కూడుకోని ఉన్నాయని అన్నారు. మీకు బాలీవుడ్‌లో బాగా నచ్చిన చిత్రం ఏమిటని అడడగా లేడిగాగా అందుకు సమాధానంగా ఒక్క సినిమా అంటూ ఏమిలేదని అన్ని సినిమాలు తనకు నచ్చాయని అన్నారు.
ఇక మీకు నచ్చిన స్టార్ హీరో, హీరోయిన్స్ ఎవరూ అని అడడగా ఈ ప్రశ్నకు సమాధానంగా నాకు ఇండియాలో చాలా మంది హీరోలు, హీరోయిన్స్ తెలుసు. అంతమందిలో ఒక్కరు అంటే కష్టం. అదీకాక నాకు తెలిసిన వాళ్శ గురించి ఇంకా మరింత సమాచారం తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నానని అన్నారు.


Click it and Unblock the Notifications











