ఈ స్టేజికి రావడానికి తను ఎంతకష్టపడింతో నాకు తెలుసు...!
లేడిగాగా ప్రపంచంలోకెల్లా అత్యుత్తమమైన స్టేజి ఫెర్పామర్. ఇదినిజం అని తెలియడానికి ఇటీవల జరిగిన యమ్ టివి మ్యూజిక్ అవార్డులే అందుకు నిదర్శనం. అంతేకాకుండా తాను చిన్నప్పటి నుండి పట్టుదల మరియు కష్టపడే మనస్తత్వం గల అమ్మాయి కావడమే దానికి కారణం అంటున్నారు ఆమో మాజి మేనేజర్. లేడిగాగా నాకు పదమూడు సంవత్సరాల వయసునుండి తెలుసు. కొన్ని సంవత్సారాలు లేడిగాగా మేనేజర్ కూడా పనిచేశాను అని అంటున్నారు బాబ్ లియెన్. ఈరోజు యావత్ ప్రపంచం మొత్తం ఆమెకు జేజేలు కోడుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ స్టేజికి రావడానికి తను ఎంతకష్టపడింతో నాకు తెలుసు. స్టేజి మీదకు వెళ్తున్న ప్రతిసారి తన తల్లి దీవెనలు తీసుకోని బయలు దేరడం నాకు ఇప్పటికి గుర్తు ఉంది అంటున్నారు బాబ్ లియెన్.
ఇటీవల జరిగిన యమ్ టివి వీడియో మ్యూజిక్ అవార్డులలో పాప్ సింగర్ లేడిగాగా విజయకేతనం ఎగరవేసిన సంగతి అందరికి తెలిసిందే. లేడిగాగా మొత్తం 14 క్యాటగిరిలకు గాను 8 అవార్డులను సోంతం చేసుకోని పాప్ మ్యూజిక్ లో తనకు తానే సాటి అని నిరూపించింది. కొరియోగ్రఫీ, ఫీమెల్ వీడియో, పాప్ వీడియో, కోలాబరేషన్ డాన్స్ వీడియో, ఎడిటింగ్ అండ్ డైరెక్టెంగ్ ఇలా ఎనిమిది శాఖలలో తాను నిర్మించినటూవంటి 'బ్యాడ్ రోమాన్స్' ఆల్బమ్ కు ఈ యమ్ టివి వీడియో మ్యూజిక్ అవార్డులను సోంతం చేసుకున్నారు. బెస్ట్ ఫీమెల్ అవార్డు తీసుకుంటూ తన మనసులోని మాటలను తన ఆనంద భాష్పాలను తెలియజేశారు.


Click it and Unblock the Notifications











