»   » హాలీవుడ్ అవకాశం: ఆస్కార్ విన్నర్‌తో నటించిన మంచు లక్ష్మి

హాలీవుడ్ అవకాశం: ఆస్కార్ విన్నర్‌తో నటించిన మంచు లక్ష్మి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మంచు మోహన్ బాబు సినీ వారసురాలు మంచు లక్ష్మి నటిగా, నిర్మాతగా, టీవీ హోస్ట్ గా తన ప్రస్తాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నే సంగతి తెలిసిందే. త్వరలో ఆమె హాలీవుడ్ సినిమాలో కూడా నటించబోతోంది. హాలీవుడ్ మూవీలో నటించడం ఇదే మొదటి సారి కాక పోయినా... ఆస్కార్ అవార్డ్ విన్నర్ తో కలిసి ఆమె నటించడం విశేషం.

మంచు లక్ష్మి ఇండియాలో పుట్టి పెరిగినా... ఆమె ఉన్నత విద్యాభాసం మొత్తం అమెరికాలోనే సాగింది. సినిమా కుటుంబంలో పుట్టడంతో మంచు లక్ష్మి కూడా అదే రంగంపై ఆసక్తి పెంచుకుంది. అమెరికాలో ఉన్నపుడు చదువుకుంటూనే నటనపై ఆసక్తితో లాస్ వేగాస్, ఈఆర్, డెస్పరేట్ హౌస్ వైఫ్ లాంటి టెలివిజ‌న్ సీరియ‌ల్స్‌తో పాటు, పలు హాలీవుడ్ సినిమాల్లోనూ చిన్న పాత్రల్లో న‌టించింది.

తర్వాత ఇండియా వచ్చిన లక్ష్మి తొలినాళ్లలో టీవీ షోలతో సందడి చేసింది. సినిమా నిర్మాతగానూ తన సత్తా చాటింది. నటిగా తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేసింది. సామాజిక కార్యక్రమాల్లోనూ పాలు పంచుకుంటూ మల్టీ టాలెంటెడ్ అనే పేరు తెచ్చుకుంది.

Lakshmi Manchu to star in Hollywood movie Basmati Blues

చాలా గ్యాప్ తర్వాత మంచు లక్ష్మీ హాలీవుడ్ లో 'బాస్మతి బ్లూస్' అనే సినిమాలో నటించింది. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం ఇండియాలోనే జ‌రింది. ఇటీవల ఈ సినిమా కోసం అమెరికా వెళ్ళిన లక్ష్మి తన డబ్బింగును కూడా పూర్తి చేశారట. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ ప‌నులు జరుగుతున్నాయి.

'బాస్మతి బ్లూస్' సినిమాలో ఆస్కార్ అవార్డ్ విజేత బ్రీ లార్సన్, డోనాల్డ్ సతర్లాండ్, స్కాట్ బకుల ముఖ్య పాత్రల్లో నటించారు. డాన్ బారోన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని మేనిక్యూ కాల్ ఫీల్డ్ నిర్మించాడు. ఈ సినిమా ఓ సైంటిస్ట్ క‌థ‌. తాను సృష్టించిన కొత్త వరివంగడాన్ని మార్కెట్ చేసుకోవడానికి ఇండియాకు వచ్చే ఓ శాస్త్రవేత్త ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కున్నాడన్నది కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది.

English summary
Lakshmi Manchu is not an unknown face in Hollywood. The actress will now once again act in a Hollywood film called Basmati Blues which will be directed by Dan Baron.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu