ఐదవ సారి తన అంగీకారాన్ని తెలిపిన స్విమ్ సూట్ మోడల్...
ఆస్ట్రేలియా స్విమ్ సూట్ మోడల్ లారా బింగిల్ నాలుగు సార్లు డాన్నింగ్ విత్ ద స్టార్స్ అనే రియాలిటీ షోలో పాల్గోనే అవకాశం వచ్చినా ఆఅవకాశాన్ని తిరస్కరించింది. కాని ఈసారి జరగబోయేటటువంటి డాన్నింగ్ విత్ ద స్టార్స్ రియాలిటీ షోలో పోల్గోనడానికి సంసిద్దత వ్యక్తం చేసిందని సమాచారం. లారా బింగిల్ తోపాటు ఈసారి మెల్ బోర్న్ సోషియోలిట్ బ్రైన్ని ఎడిల్టన్, ఆల్బి మాంగల్స్ , ప్రముఖ చెప్ మాను ఫీల్డెల్ షోలో పోల్గోనడానికి ఆసక్తి చూపుతున్నారని సమాచారం. ప్రస్తుతానికి లారా బింగిల్ న్యూఇయర్ సంబరాలు ఉండడం వల్ల అమెరికాలోనే ఉన్నారు.
లారా బింగిల్ ఈపేరు మనకు ఓ మోడల్ కంటే కూడా ఆస్టేలియా క్రికెట్ వైస్ కెప్టెన్ మైఖెల్ క్లార్క్ మాజి లవర్ గా బాగా సుపరిచితం. ప్రస్తుతం లారా బింగిల్ పేరు న్యూయర్క్ మరియు ఆస్ట్రేలియాలో మారుమ్రోగిపోతుంది. దానికి కారణం ఇటీవల లారా బింగిల్ స్విమ్ షూట్ లో ఓ భీభత్సమైన పోటోషూట్ చేయడానికి సిద్దం అయ్యారంట. తన ప్రెండ్స్ కుక్కపిల్లను తీసుకోని జాగింగ్ కివెళ్శిన లారా బింగిల్ ను వెంబడించిన మీడియాతో ఆమె కోన్ని విషయాలను వెల్లడించారు.
లారా బింగిల్ మాట్లాడుతూ ప్రస్తతం నేను చేస్తున్నటువంటి స్విమ్ షూట్ కాంపెయిన్ కోరకు ఎంతో కష్టపడి మంచి షేపు రావడం కోసం వ్యాయామాలు చేస్తున్నాను. ప్రస్తుతం ట్రైనర్ సారధ్యంలో మూడురోజులు వ్యాయామాలు చేస్తున్నాను. మిగిలిన మూడు రోజులు నాకు నేను స్వతహాగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇక ఆదివారం మాత్రం సెలవు. ఇది కూడా ఒక జాబ్ లాంటిదే. ప్రస్తుతం నేను చేస్తున్నటువంటి ఈ వ్యాయామాలు అన్ని స్విమ్ షూట్ పోటోషూట్ కోరకేనని అన్నారు.


Click it and Unblock the Notifications











