వేలం పాటలో రికార్డు స్దాయి ధర పలికిన సింగర్ డ్రస్సు
చనిపోయిన తర్వాత కూడా కొందరి సెలబ్రిటీలకు సంబంధించిన వస్తువులను ఇప్పుడున్న అభిమానులు చేజిక్కించుకునేందుకు పోటీ పడుతుంటారు.సరిగ్గా ఇలాంటి పోటీ పడి లండన్‌లో ఉన్న ఓ అభిమాని చనిపోయిన మాజీ సింగర్ అమే వైన్‌హౌస్ బ్రతికున్న కాలంలో 'బ్యాక్ టు బ్యాక్'ఆల్బమ్ కవర్ పేజిపై ధరించిన డ్రస్సుని వేలం పాటలో 40,000 పౌండ్లుకు సొంతం చేసుకున్నాడు.
ఇక వివరాల్లోకి వెళితే ఈ డ్రస్సుని రూపొందించిన ధాయ్ డిజైనర్ దిసయా లండన్‌లో ఉన్న 'సౌత్ అమెరికన్ ఫ్యాషన్ మ్యూజియమ్' లో వేలం పాట పెట్టడం జరిగింది. ఈ వేలం పాట ద్వారా వచ్చిన సొమ్ముని అమే వైన్ హౌస్ ఫౌండేషన్‌కు అందించనున్నట్లు తెలిపారు. సుమారుగా ఈ డ్రస్సు 10,000 నుండి 20,000 పౌండ్లు వరకు వసూలు చేస్తుందని భావించారు. కానీ ఎవరూ ఊహించని రీతిలో 40,000 పౌండ్లకు అమ్ముడై అక్కడున్న వారందరిని ఆశ్చర్యచకితులను చేసింది. వైన్ హౌస్ అత్యధికంగా డ్రగ్స్, ఆల్కహాల్ తీసుకొవడం వల్ల జులైలో మరణించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











