నగ్నంగా నటించడమంటే నాకు భలే సరదా..!
ఎక్స్ మ్యాన్: ఫస్ట్ క్లాస్ సినిమా ద్వారా హాలీవుడ్ సినిమాల్లో తనకంటూ ఓ గుర్తింపుని తెచ్చుకున్న హీరోయిన్ 'జెన్నిఫర్ లారెన్స్'. 20 సంవత్సరాల వయసులో ఉత్తమ నటి అకాడమీ అవార్డు నామినేషన్స్‌కి ఎంపికైన అతి పిన్న వయస్కురాలు. ప్రస్తుతం జెన్నిఫర్ లారెన్స్ సుజన్నే కొలిన్స్ రచించిన పుస్తకం 'ది హాంగర్ గేమ్స్ ట్రైయాలజీ' ఆధారంగా తీస్తున్న 'ది హాంగర్ గేమ్స్' సినిమాలో నటిస్తున్నారు.
ఈ షూటింగ్ సందర్బంలో గ్లామర్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్యూలో జెన్నిఫర్ లారెన్స్ మాట్లాడుతూ సాధారణంగా హీరోయిన్లు తెరపై నగ్నంగా కనిపించేందుకు ఓ తెగ ఇబ్బంది పడిపోతుంటారు. కానీ నా విషయంలో అలా కాదు.. కథ డిమాండ్ చేస్తే తెరపై నగ్నంగా కనిపించేందుకు నేను సిద్దం. కొన్ని కొన్ని సీన్లు అభిమానుల అంచనాలకు దగ్గరవ్వాలంటే నగ్నంగానే నటించాలని అన్నారు. ఇప్పటి వరకు నేను నటించిన సినిమాల్లో నాకు అలాంటి సీన్లు చేసే అవకాశం రాలేదు.
ఈ భూమి మీద దేవుడిచ్చిన జీవులలో అందమైన జీవి మనిషి. సో దానిని ఎంతలా ఎక్స్ పోజ్ చేస్తే అంత బాగుంటుందే... తప్ప దాచుకుంటే ఏముటుంది చెప్పండని అన్నారు.


Click it and Unblock the Notifications











