twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాలీవుడ్ లెజెండరీ యాక్టర్ పీటర్ ఫోండా ఇక లేరు

    |

    హాలీవుడ్ లెజెండరీ యాక్టర్ పీటర్ ఫోండా ఇక లేరు. చాలా కాలంగా లంగ్ క్యాన్సర్‌తో బాధ పడుతున్న ఆయన శ్వాస సంధమైన సమస్యతో కన్నుమూశారు. ఫోండా వయసు 79 సంవత్సరాలు. ఈ ప్రముఖుడి మృతి పట్ల పలువురు అమెరికన్ సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేశారు.

    హాలీవుడ్ గ్రేట్ హెన్రీ ఫోండా కుమారుడైన పీటర్ ఫోండా తండ్రి వారసత్వంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఈజీ రైడర్, ది హైర్డ్ హ్యాండ్, ఓపెన్ సీజన్, ఘోస్ట్ రైడర్, వైల్డ్ హాగ్స్, 3:10 టు హుమా లాంటి ఎన్నో క్లాసికల్ చిత్రాల్లో నటించారు.

    Legendary Hollywood actor Peter Fonda passes away

    ఫిబ్రవరి 23, 1940లో న్యూయార్కులో జన్మించిన పీటర్ ఫోండా... ఆగస్టు 16 లాస్ ఏంజెలెస్‌లో కన్నుమూశారు. కేవలం నటుడిగానే కాదు దర్శకుడిగా కూడా ఆయన పలు చిత్రాలకు పని చేశారు. ఈజీ రైడర్ చిత్రానికి బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో, ఉలీస్ గోల్డ్ అనే చిత్రానికి అకాడమీ అవార్డులకు నామినేట్ అయ్యాడు. రెండు సార్లు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు గెలుచుకున్నాడు.

    పీటర్ ఫోండా గతేడాది 'బౌండరీస్' అనే చిత్రంలో నటించారు. 2019లో ఆయన నటించిన 'ది లాస్ట్ ఫుల్ మెజర్' చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. సినిమాలతో పాటు ఆయన పలు టీవీ సిరీస్‌లలో నటించారు.

    English summary
    Legendary Hollywood actor Peter Fonda passed away at the age of 79. Peter Henry Fonda was an American actor, director, and screenwriter. He was the son of Henry Fonda, younger brother of Jane Fonda, and father of Bridget Fonda. He was a part of the counterculture of the 1960s.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X