Don't Miss!
- News దానం నాగేందర్ కు షాక్ - కాంగ్రెస్ అభ్యర్ది మార్పు..!?
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
హాలీవుడ్ లెజెండరీ యాక్టర్ పీటర్ ఫోండా ఇక లేరు
హాలీవుడ్ లెజెండరీ యాక్టర్ పీటర్ ఫోండా ఇక లేరు. చాలా కాలంగా లంగ్ క్యాన్సర్‌తో బాధ పడుతున్న ఆయన శ్వాస సంధమైన సమస్యతో కన్నుమూశారు. ఫోండా వయసు 79 సంవత్సరాలు. ఈ ప్రముఖుడి మృతి పట్ల పలువురు అమెరికన్ సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేశారు.
హాలీవుడ్ గ్రేట్ హెన్రీ ఫోండా కుమారుడైన పీటర్ ఫోండా తండ్రి వారసత్వంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఈజీ రైడర్, ది హైర్డ్ హ్యాండ్, ఓపెన్ సీజన్, ఘోస్ట్ రైడర్, వైల్డ్ హాగ్స్, 3:10 టు హుమా లాంటి ఎన్నో క్లాసికల్ చిత్రాల్లో నటించారు.
ఫిబ్రవరి 23, 1940లో న్యూయార్కులో జన్మించిన పీటర్ ఫోండా... ఆగస్టు 16 లాస్ ఏంజెలెస్‌లో కన్నుమూశారు. కేవలం నటుడిగానే కాదు దర్శకుడిగా కూడా ఆయన పలు చిత్రాలకు పని చేశారు. ఈజీ రైడర్ చిత్రానికి బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో, ఉలీస్ గోల్డ్ అనే చిత్రానికి అకాడమీ అవార్డులకు నామినేట్ అయ్యాడు. రెండు సార్లు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు గెలుచుకున్నాడు.
పీటర్ ఫోండా గతేడాది 'బౌండరీస్' అనే చిత్రంలో నటించారు. 2019లో ఆయన నటించిన 'ది లాస్ట్ ఫుల్ మెజర్' చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. సినిమాలతో పాటు ఆయన పలు టీవీ సిరీస్‌లలో నటించారు.