మంచి సంబంధం కొనసాగాలంటే వ్యక్తిత్వం ముఖ్యం
హాలీవుడ్ స్టార్ హీరోయిన్ జెస్సికా బీల్ ఇటీవల ఇన్‌స్టయిల్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ప్రముఖ ఇంటర్యూలో ఎవరితోనైనా ఒక వ్యక్తితో సంబంధం పెట్టుకోవడానికి ముందు అతని వ్యక్తిత్వం గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. తనని ఎంతగానో ప్రేమిస్తున్న స్టార్ హీరో జస్టిన్ టింబర్లేక్‌తో ఇటీవలే జెస్సికా బీల్ నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకోనున్నారు.
30 సంవత్సరాల వయసు కలిగిన జెస్సికా బీల్ గతంలో నేను కొనసాగించిన సంబంధాలు నాకు హానిని కలిగించే విధంగా తన అనుభవాలను వెల్లడించారు. మనం ఎవరితోనైనా సంబంధం కొనసాగిస్తున్నామంటే వారియొక్క అలవాట్లు, లైఫ్ స్టయిల్ ఏవిధంగా ఉందో మొదటగా మనం తెలుసుకోవాలన్నారు.
మీరు చిన్నప్పటి నుండే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటే.. జీవితంలో పెద్దవారు అయ్యేకొద్ది ఆ లక్షణాలు మిమ్మల్ని గర్వపడేలా చేస్తాయని చెప్పింది. నేను మంచి వ్యక్తిత్వం కలిగిన దానిని కాబట్టే నేను సులభంగా అవతలి వారి జీవితాన్ని తెలుసుకుంటాను. ఇది నిరంతరం సాగే ఓ జీవన ప్రయాణం లాంటిది. ఇప్పడిప్పుడే నేను దానిని పొందుతున్నానని చెప్పింది. జెస్సికా బీల్ గతంలో హీరో క్రిస్ ఇవాన్స్, స్పోర్ట్స్ మ్యాన్ డెరిక్ జీటర్‌తో డేటింగ్ చేశారు.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications











