వారిద్దరూ విడిగా వుండలేక పోయారు...!!
టైటానిక్ సినిమా హీరో లినార్డినో డి కాప్రియో, తన మాజీ ప్రియురాలు బార్ రెఫేలి తో కలసిపోతున్నాడని విశ్వసనీయ సమాచారం. మూడేళ్లపాటు కలసి వున్న ఈ జంట గత జూన్ నెలలో విడిపోయారు. ఆ తర్వాత లినార్డినో పేరును ఎంతో మంది నటీమణులతో, మోడళ్లతో ముడివేసారు. ఓ సారి బ్రిటీష్ నటి సియాన్నా మిల్లతో డేటింగ్ చేస్తున్నాడని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోనున్నాడనే వార్తుల కూడా వచ్చాయి.
రెఫేలి కూడా ఇటీవలే 'గాసిప్ గర్ల్' ఫేం క్రావ్ఫోర్డ్ తో డేటింగ్ చేస్తోందనే వార్తలు వచ్చాయి. కానీ యుయస్ వీక్లీ వార్తల ప్రకారం వీరిద్దరూ తిరిగి కలసిపోతున్నారని తెలిసింది. వీరిద్దరూ విడిపోయాకా లినార్డినో కొన్ని రోజుల తర్వాత సాధారణంగా వుంటుండగా, రెఫేలి మాత్రం ఈ ఎడబాటుతో బాగా దిగులు చెందిందట. ఆ తర్వాత అతనికి చాలా సార్లు ఫోను చేస్తుండేదని, వీరిద్దరూ తిరిగి కలసిపోనున్నారనే వార్త విని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆమె శ్రేయోభిలాషులు.


Click it and Unblock the Notifications











