19 ఏళ్ల అమ్మాయితో 49 ఏళ్ల స్టార్ హీరో రొమాన్స్.. బికినీ భామతో సరసాలు!

హాలీవుడ్ సూపర్‌స్టార్ లియోనార్డో డికాప్రియో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టైటానిక్ సినిమాతో ప్రపంచ సినీ తెరపై తిరుగులేని నటుడిగా నిలిచారు. ఆ సినిమాతో భారతీయులకు కూడా ఆయన పరిచయమయ్యారు. తన సినిమాలు, చేతలు, మాటలతో నిత్యం వార్తల్లో ఉంటుంటారు లియోనార్డ్. మరీ ముఖ్యంగా ఆయన ఎఫైర్స్, డేటింగ్ అంశాలు మీడియాకు బోల్డెంత పని పెడుతుంటాయి. తాజాగా అలాంటి కలకలమే రేపారు లియోనార్డో డికాప్రియో. ఈ వివరాల్లోకి వెళితే..

నవంబర్ 11, 1974న అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో జన్మించారు డికాప్రియో. ఆయన మెరైన్ బయోలజిస్ట్ లేదా నటుడు కావాలని చిన్నప్పటి నుంచి కలలు కన్నారు. హైస్కూల్ సమయంలోనే చదువును మధ్యలో వదిలేసిన ఆయన టెలివిజన్ రంగం వైపు అడుగులు వేశారు. పదేళ్ల వయసులోనే రాంపర్ రూమ్ అనే చిల్డ్రన్ సిరీస్‌లో నటించిన డికాప్రియో .. 14 ఏళ్ల వయసులోనే కమర్షియల్ యాడ్స్‌లోనూ నటించి సత్తా చాటారు. క్రాఫ్ట్ సింగిల్స్, బబుల్ యమ్, యాపిల్ జాక్స్ వంటి ప్రఖ్యాత కంపెనీల ఉత్పత్తులకు బ్రాండింగ్ చేశారు.

Leonardo DiCaprio beach vacation photos with 19 years girl friend trending

1989లో ది న్యూ లెస్సీ అనే టెలివిజన్ షోలో కనిపించి పాపులర్ అయ్యారు. 1990 నాటికి టెలివిజన్ సిరీస్‌లలో నటిస్తూ వచ్చిన ఆయన 1991లో చిత్ర పరిశ్రమ వైపు అడుగులు వేశారు. క్రిట్టర్స్ 3 అనే సినిమాతో ఆయన హాలీవుడ్‌లో అడుగుపెట్టారు. తర్వాత దిస్ బాయ్స్ లైఫ్ అనే సినిమాలో నటించారు. అలా టెలివిజన్ సిరీస్‌లు, సినిమాలు చేస్తున్న ఆయన కెరీర్‌ను టైటానిక్ మలుపు తిప్పింది. టైటానిక్ ఓడ ప్రమాదానికి, ప్రేమ కథను జోడించి విలక్షణ దర్శకుడు జేమ్స్ కెమరూన్ తెరకెక్కించిన టైటానిక్‌లో హీరోగా ఆయన ఛాన్స్ అందుకున్నారు.

ఇందులో కేట్ విన్సెలెట్‌కు జోడీగా ఆయన నటన హైలైట్‌గా నిలిచింది. ప్రపంచ సినీ చరిత్రలోనే అద్భుత ప్రేమకథల్లో ఒకటిగా టైటానిక్ గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.2.1 బిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించడంతో పాటు 11 అకాడమీ అవార్డ్స్ సొంతం చేసుకుంది. అయితే తనకు ఆస్కార్ రాకపోవడంపై డికాప్రియో తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతో ఆస్కార్ కమిటీపై అక్కసు వెళ్లగక్కాడు. అయితే ఆస్కార్‌తో సమానమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్‌ను ఆయన అందుకున్నారు. ఆరు సార్లు ఆస్కార్‌కు నామినేట్ అయిన డికాప్రియోకు పలుమార్లు నిరాశ ఎదురవ్వగా.. 2016లో తన చిరకాల స్వప్నం సాకారం చేసుకున్నాడు. రెవనంట్‌లో నటనకు గాను ఆస్కార్ అవార్డ్‌ను ముద్దాడిన డికాప్రియో సంబరాలు చేసుకున్నాడు.

ఇక వ్యక్తిగత జీవితంలో లియోనార్డో డికాప్రియో పలు వివాదాలను మూటకట్టుకున్నాడు. ముఖ్యంగా 25 ఏళ్ల లోపు అమ్మాయిలతోనే ఇతను డేటింగ్ చేయడం , వారితో బ్రేకప్ చెప్పడం వంటి వార్తలతో షాకిచ్చాడు. తాజాగా ఈ సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ ఓ 19 ఏళ్ల అమ్మాయితో బీచ్‌లో కనిపించడం కలకలం రేపింది. కరేబియన్ దీవుల్లోని ప్రిస్టెన్ బీచ్‌లో తన గర్ల్‌ఫ్రెండ్‌తో రొమాన్స్‌లో మునిగి తేలాడు డికాప్రియో. అయితే హీరో గారితో ఉన్న అమ్మాయి ఎవరు? ఆమె నేపథ్యం ఏమిటీ ? అన్నది మాత్రం తెలియరాలేదు. కానీ వీరిద్దరి ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

More from Filmibeat

Read more about: leonardo dicaprio movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X