Just In
- 9 hrs ago
ట్రెండింగ్ : అవే ఆడదాని ఆయుధాలు.. అక్కడ పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు.. మళ్లీ రెచ్చిపోయిన శ్రీరెడ్డి
- 10 hrs ago
బాత్ టబ్ పిక్‌తో రచ్చ.. లైవ్‌కి వస్తాను.. వనిత విజయ్ కుమార్ పోస్ట్ వైరల్
- 11 hrs ago
అది సంప్రదాయంగా ఎప్పుడు మారింది.. యాంకర్ రష్మీ ఆవేదన
- 12 hrs ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
Don't Miss!
- Automobiles
ఒంటె వల్ల మరణించిన ప్రముఖ బైక్ రైడర్.. ఎవరో తెలుసా!
- Lifestyle
ఆదివారం దినఫలాలు : ఈరోజు ప్రతికూల పరిస్థితుల్లో కూడా ధైర్యంగా పని చేయాలి...!
- News
జేఈఈ మెయిన్స్ దరఖాస్తుల గడువు పొడిగింపు: ఎప్పటి వరకంటే..?
- Finance
రూ.49,000 దిగువన బంగారం ధరలు, రూ.1650 తగ్గిన వెండి
- Sports
పశ్చాత్తాపం అస్సలు లేదు.. నిర్లక్ష్య షాట్‌పై రోహిత్ వివరణ!!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రేప్,దొంగతనం చేసింది...నాలోని అపరిచితుడే
లాస్ ఏంజిల్స్ : మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ పేరు మనకు చాలా సుపరిచితం. ఈ పేరు వినగానే మనకు శంకర్ , విక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అపరిచితుడు' సినిమా గుర్తొస్తుంది.ఇప్పుడు ఇలాంటి కథతోనే హాలీవుడ్‌లో 'ది క్రౌడెడ్ రూమ్' పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ చిత్రం స్పెషాలిటీ ఏంటంటే...తను చేసిన రేప్,దొంగతనం తాను చేయలేదని తనలోని మల్టి పర్శనాలిటీ డిజార్డర్ లోంచి వచ్చిన అపరిచితులు చేసారని కోర్టుకు ఎక్కిన కథ ఇది.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
అయితే ఇందులో స్పెషాలిటీ ఏకంగా హీరో...24 భిన్న వ్యక్తిత్వాలతో సమస్యల్లో చిక్కుకుంటాడు. ఇలాంటి అరుదైన,విలక్షణమైన పాత్రలో లియోనార్డో డికాప్రియో నటిస్తున్నారు. ఈ పాత్రకోసం లియోనార్డో చాలా నెలల పాటు ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. రకరకాల వ్యక్తుల ను పరిశీలించి,వారి మ్యానరిజమ్స్ ని,వివిధ పరిస్ధితుల్లో వారి ఎలా స్పందిస్తారో అవగాహన చేసుకుని పాత్రకు నిండు తనం తెచ్చేలా చేసినట్లు చెప్తున్నారు.

మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ వల్ల నేరాలు చేసి కోర్టు విచారణలో నిర్దోషిగా తేలిన తొలి వ్యక్తి బిల్లీ మిల్లిగన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అలెజాండ్రో జి ఇనారిట్టు దర్శకత్వం వహిస్తున్నారు.
డైరక్టర్ గురించి...
దర్శకుడు అలెజాండ్రో జి ఇనారిట్టు మరెవరో కాదు..రీసెంట్ గా తన చిత్రానికి నాలుగు ఆస్కార్ లు సంపాదించి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన డైరక్టర్. మెక్సికన్ డైరెక్టర్ అలెజాండ్రో గోంజాలెజ్ ఇన్యారీటూ రూపొందించిన ‘బర్డ్‌మ్యాన్' సినిమా 2015 ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ చిత్రం అవార్డును కైవసం చేసుకుంది. ఈ చిత్రానికి అత్యధికంగా నాలుగు అవార్డులు లభించాయి. దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, ఒరిజినల్ స్ర్కీన్‌ప్లే రచనలోనూ ‘బర్డ్‌మ్యాన్' అవార్డులు సొంతం చేసుకుంది.

హీరో ఎక్కడికెళ్లినా 'బర్డ్‌మ్యాన్.. బర్డ్‌మ్యాన్' అని పిలుస్తుంటారు. అంతగా ఆ పాత్రతో పేరు సంపాదించుకున్నాడాయన. అలాంటి వాడు నటన వదిలేద్దామనుకున్నాడు. దర్శకత్వం వైపు రావడానికి ప్రయత్నాలు చేస్తాడు. మరి అతడి ప్రయత్నం ఫలించిందా? ఈ కథతో అల్లుకున్న సినిమా 'బర్డ్‌మ్యాన్'. మైఖేల్ కీటన్ ముఖ్య పాత్రధారి. అలెజాండ్రో జి.ఇనారిట్టు దర్శకత్వం వహించారు.