twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రేప్,దొంగతనం చేసింది...నాలోని అపరిచితుడే

    By Srikanya
    |

    లాస్ ఏంజిల్స్ : మల్టిపుల్‌ పర్సనాలిటీ డిజార్డర్‌ పేరు మనకు చాలా సుపరిచితం. ఈ పేరు వినగానే మనకు శంకర్ , విక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అపరిచితుడు' సినిమా గుర్తొస్తుంది.ఇప్పుడు ఇలాంటి కథతోనే హాలీవుడ్‌లో 'ది క్రౌడెడ్‌ రూమ్‌' పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ చిత్రం స్పెషాలిటీ ఏంటంటే...తను చేసిన రేప్,దొంగతనం తాను చేయలేదని తనలోని మల్టి పర్శనాలిటీ డిజార్డర్ లోంచి వచ్చిన అపరిచితులు చేసారని కోర్టుకు ఎక్కిన కథ ఇది.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    అయితే ఇందులో స్పెషాలిటీ ఏకంగా హీరో...24 భిన్న వ్యక్తిత్వాలతో సమస్యల్లో చిక్కుకుంటాడు. ఇలాంటి అరుదైన,విలక్షణమైన పాత్రలో లియోనార్డో డికాప్రియో నటిస్తున్నారు. ఈ పాత్రకోసం లియోనార్డో చాలా నెలల పాటు ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. రకరకాల వ్యక్తుల ను పరిశీలించి,వారి మ్యానరిజమ్స్ ని,వివిధ పరిస్ధితుల్లో వారి ఎలా స్పందిస్తారో అవగాహన చేసుకుని పాత్రకు నిండు తనం తెచ్చేలా చేసినట్లు చెప్తున్నారు.

    Leonardo DiCaprio finding room for 24 characters in The Crowded Room

    మల్టిపుల్‌ పర్సనాలిటీ డిజార్డర్‌ వల్ల నేరాలు చేసి కోర్టు విచారణలో నిర్దోషిగా తేలిన తొలి వ్యక్తి బిల్లీ మిల్లిగన్‌ జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అలెజాండ్రో జి ఇనారిట్టు దర్శకత్వం వహిస్తున్నారు.

    డైరక్టర్ గురించి...

    దర్శకుడు అలెజాండ్రో జి ఇనారిట్టు మరెవరో కాదు..రీసెంట్ గా తన చిత్రానికి నాలుగు ఆస్కార్ లు సంపాదించి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన డైరక్టర్. మెక్సికన్‌ డైరెక్టర్‌ అలెజాండ్రో గోంజాలెజ్‌ ఇన్యారీటూ రూపొందించిన ‘బర్డ్‌మ్యాన్‌' సినిమా 2015 ఆస్కార్‌ అవార్డుల్లో ఉత్తమ చిత్రం అవార్డును కైవసం చేసుకుంది. ఈ చిత్రానికి అత్యధికంగా నాలుగు అవార్డులు లభించాయి. దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, ఒరిజినల్‌ స్ర్కీన్‌ప్లే రచనలోనూ ‘బర్డ్‌మ్యాన్‌' అవార్డులు సొంతం చేసుకుంది.

    Leonardo DiCaprio finding room for 24 characters in The Crowded Room

    హీరో ఎక్కడికెళ్లినా 'బర్డ్‌మ్యాన్‌.. బర్డ్‌మ్యాన్‌' అని పిలుస్తుంటారు. అంతగా ఆ పాత్రతో పేరు సంపాదించుకున్నాడాయన. అలాంటి వాడు నటన వదిలేద్దామనుకున్నాడు. దర్శకత్వం వైపు రావడానికి ప్రయత్నాలు చేస్తాడు. మరి అతడి ప్రయత్నం ఫలించిందా? ఈ కథతో అల్లుకున్న సినిమా 'బర్డ్‌మ్యాన్‌'. మైఖేల్‌ కీటన్‌ ముఖ్య పాత్రధారి. అలెజాండ్రో జి.ఇనారిట్టు దర్శకత్వం వహించారు.

    English summary
    Actor Leonardo DiCaprio will star in biopic of Billy Milligan, a schizophrenic who successfully defended robbery and rape charges by arguing that the crimes were the work of two of his 24 personalities
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X