లియోనార్డో 'నిన్ను వదలా' అంటున్న లిండ్సే
'మీన్ గర్ల్స్' నటి లిండ్సే లోహన్, హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందట. అంతే కాదు అతనే తన పర్ఫెక్ట్ మ్యాన్ అని కలలు కంటోందట. లిండ్సే లెస్బియన్ పార్ట్ నర్ సమంతా కు లియోనార్డో మంచి మిత్రుడు కావడంతో అతనితో రొమాన్స్ చెయ్యవచ్చని ఆమె భావిస్తోందట. కానీ ఆమె సన్నిహితులు మాత్రం లియోనార్డో లిండ్సే తో సన్నిహితంగా వుండటాని, రొమాన్స్ చెయ్యడానికి ఆసక్తి చూపడం లేదని చెబుతున్నారు.
కానీ లిండ్సే మాత్రం ఈ టైటానికి సినిమా హీరోతో సన్నిహితంగా మెలగడానికి తెగప్రయత్నాలు చేస్తోందట. కానీ అతను మాత్రం ఆమెను పట్టించుకోవడం లేదట...పాపం లిండ్సే... కానీ ఆమె మాత్రం పాపం అనకండి ఎప్పటికైనా లియోనార్డో ప్రేమను పొందుతానని ధీమాగా చెబుతోంది. చూద్దాం ఆమె ప్రయత్నాలు ఎంత మేర సఫలీకృతం అవుతాయో....
లిండ్సే లోహన్ లియోనార్డో డికాప్రియో టైటానికి హాలీవుడ్ సమంతా రాన్సన్ lindsay lohan leonardo dicaprio titanic hollywood samantha ronson


Click it and Unblock the Notifications