twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాకు అతను రాక్ హీరో అంటున్న ఆస్కార్ విన్నర్

    By Nageswara Rao
    |

    అది 1997వ సంవత్సరం. ఆ సంవత్సరంలో ప్రపంచంలో ఓ అద్బుతం ఆవిష్కరింపబడింది. ఏంటా ఆ అద్బుతం అని అనుకుంటున్నారా..? యావత్ ప్రపంచం మొత్తం మొచ్చుకున్నటువంటి బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్ సినిమా టైటానిక్ విడుదలైనటువంటి సంవత్సరం. అప్పటి వరకు హాలీవుడ్‌లో ఉన్నటువంటి ఉన్నటువంటి సినిమా రికార్డులన్నీ ఒక్కసారి బద్దలై పోయిన సంవత్సరం. అది మాత్రమే కాకుండా టైటానిక్ సినిమా నటించినటువంటి హీరో లియోనార్డో డికాప్రియో, హీరోయిన్ కేట్ విన్స్‌లెట్ ఇద్దరికి ఆ సంవత్సరం అభిమానులు బ్రహ్మారధం పట్టారు.

    ఇది మాత్రమే కాకుండా టైటానిక్ సినిమాకి ఆ సంవత్సరం ఎన్నో ఆస్కార్ అవార్డులను తెచ్చిపెట్టింది. ఈ సందర్బంలో కేట్ విన్స్‌లెట్ మాట్లాడుతూ నాతో లియోనార్డో డికాప్రియోకు ఉన్న సంబంధం అవినాభావమైనది. నా భర్త శ్యామ్ మెండిస్‌తో నేను విడాకులు తీసుకోని నేను చీకటి రోజులుగా గడిపిన సమయంలో నాకు లియోనార్డో డికాప్రియో ఎంతగానో సహాయపడ్డారు. నా జీవితంలో జరిగినటువంటి ఎటువంటి సంఘటనలు ఎవైనా లియోనార్డో డికాప్రియోతో పంచుకోవడం జరుగుతుంది.

    లియోనార్డో డికాప్రియో నాకు ప్రాణ మిత్రుడు కంటే ఎక్కువ. మా ఇద్దరి మద్య జరిగినటువంటి అన్ని ఎక్సపీరియన్స్‌ని ఇద్దరం పంచుకోవడం జరుగుతుందన్నారు. నాకు తెలిసి ఈ ప్రపంచంలో నా గురించి బాగా తెలిసిన వాళ్శల్లో లియోనార్డో డికాప్రియో ఒకరు అని అన్నారు. ఈ విషయాన్ని లియోనార్డో డికాప్రియో కూడా అంగీకరించడం జరిగింది. మేము ఇద్దరం హాలీవుడ్ ఇండస్ట్రీలో కలసి ఎదగడం జరిగిందన్నారు. ఇది మాత్రమే కాకుండా మా జీవితాలలో జరిగినటువంటి అన్ని సంఘటనలు ఇద్దరం కలసి షేర్ చేసుకోవడం జరుగుతుందని లియోనార్డో డికాప్రియో వివరించారు.

    English summary
    Leonardo DiCaprio is my rock, says Kate Winslet
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X