కరోనా పేరుతో టైటానిక్ హీరో రొమాన్స్.. కుర్ర హీరోయిన్‌తో గృహనిర్భంధం
కరోనావైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంటే టైటానిక్ హీరో మాత్రం తన గర్ల్‌ఫ్రెండ్‌తో గృహ నిర్భంధం పేరుతో రొమాంటిక్‌గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఆయన మీడియాతో పంచుకోవడం గమనార్హం. హాలీవుడ్ యాక్టర్ లియానార్డో డి కాప్రియో, ఆయన గర్ల్‌ఫ్రెండ్ కమిలా మొరోనే ప్రస్తుతం గృహ నిర్భంధంలో ఉన్నట్టు మీడియా వర్గాలు ధృవీకరించాయి.
డికాప్రియో, కమిలా మొరానో ఇద్దరు ఎప్పుడూ కలిసే ఉంటారు. కానీ వారిద్దరి ప్రైవసీని చాలా జాగ్రత్తగా మెయింటెన్ చేస్తారు. అయితే వారిద్దరు అందరి మాదిరిగా సోషల్ మీడియాతో తమ వ్యక్తిగత జీవితాన్ని పంచుకోరు. సమయం చిక్కితే వారిద్దరు రొమాంటిక్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తారు అని హాలీవుడ్ పత్రికకు తన సన్నిహితులు వెల్లడించారు.

అయితే డికాప్రియో, మొరోనే మధ్య వయసు తేడా భారీగానే ఉంది. డికాప్రియో కంటే ఆమె 23 ఏళ్లు చిన్నది. అయితే వయసు గ్యాప్ వారి రొమాంటిక్ లైఫ్‌కు అడ్డుకాకపోవడం గమనార్హమని సన్నిహితులు చెప్పుకొంటారు.
గత ఆగస్టులో వారిద్దరికి ఎంగేజ్‌మెంట్ జరిగిందని, కమిలా మొరోనే అంటే చాలా ఇష్టం అందుకే ఆమెను వదుకోలేకపోతున్నాడు అని ఓ పత్రిక కథానాన్ని వెల్లడించింది. గతంలో డికాప్రియోకు పలువురు హీరోయిన్లతో రిలేషన్‌షిప్ ఉన్నాయి. బ్లేక్ లైవ్లీ, బార్ రేఫేలీ, దియోడ్ బండ్‌చెన్, ఎరిన్ హీతర్‌టన్, టోని డామ్‌తో డేటింగ్ చేసినట్టు వార్తలు వచ్చాయి. గత కొద్దికాలంగా కమిలా మొరోనేతోనే రిలేషన్ షిప్‌ను కొనసాగిస్తున్నారు.


Click it and Unblock the Notifications











