డ్రగ్స్ శాతం నాశరీరం నుండి తీసివేశారు ఇక నేను కంప్లీట్ హీరోయిన్..
ఇటీవల కాలంలో డ్రగ్స్ తీసుకోని చాలా ఇబ్బందులకు గురైన హలీవుడ్ సెక్సీ తార లిండ్సే లోహాన్ తిరిగి తను యధాస్ధానానికి వచ్చినట్లు రిహాబ్ అధికారులు గుర్తించడమే కాకుండా తన కాలిఫోర్నియా లైసెన్స్ తిరిగి తనకు ఇవ్వడం కూడా జరిగిందంట. గత సెప్టెంబర్ లోలిండ్సే లోహాన్ కుజరిపినటువంటి రెండు డ్రగ్ టెస్ట్ లలో ఫెయిల్ అవ్వడం వల్ల తనని మూడు నెలల పాటు రిహాబ్ కుతరిలించిన విషయం అందిరికి తెలిసిందే. అదే సమయంలో తన వద్దనున్నటువంటి కాలిపోర్నియా డ్రైవింగ్ లైసెన్సు కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది.
2007వ సంవత్సరంలో డ్రగ్స్ తీసుకోని కారు యాక్సిడెంట్ చేసినటువంటి లిండ్సే లోహాన్ కు డ్రగ్స్ టెస్ట్ లు జరిపి 90 రోజులు జైలు శిక్ష మరియు డ్రగ్స్ శాతాన్ని తన శరీరం నుండి తీసివేయడానికిగాను తనని రిహాబ్ కుపంపించిన విషయం అందరికి తేలిసిందే. 90రోజులు జైలు శిక్ష కుగాను 13రోజులు మాత్రమే తనని జైలులో ఉంచడం జరిగింది. దీనికి కారణం ఈ13రోజులు జైలులో తను ప్రవర్తించినటువంటి ప్రవర్తన ఆధారంగా తనకి జైలు శిక్ష తగ్గించడం జరిగింది. ప్రస్తుతం లిండ్సే లోహాన్ తిరిగి తన పూర్వ వైభవం తెచ్చుకున్నారు. అంతేకాకుండా తను సినిమాలలో నటించడానికి కూడా సిద్ధంగా ఉన్నానంటూ ఇటీవలే వెల్లడించారు.


Click it and Unblock the Notifications











