twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డ్రగ్స్ టెస్ట్ ఫెయిల్ అయిన హీరోయిన్ పై అరెస్ట్ వారెంట్..!

    By Nageswara Rao
    |

    అమెరికాకు చెందిన నటి, మోడల్, సింగర్ లిండ్సే లోహన్ డ్రగ్స్ తీసుకోవడ వల్ల 14 రోజుల జైలు శిక్ష తోపాటు 23 రోజులు పాటు తన ఆరోగ్యం కోలుకోవాలని పెషంట్ గా ఉంచారు. ఈ సమయంలో లిండ్సే లోహన్ ఎటువంటి డ్రగ్స్ తీసుకోకూడదని ఆదేశించారు. అంతేకాకుండా తనకు ఒక ప్రోబిషన్ ఆఫీసర్ కేటాయించి ఎప్పటికప్పుడు డ్రగ్స్ టెస్ట్ చేయించడం జరుగుతుంది. ఏ సమయంలోనైనా డ్రగ్స్ టెస్ట్ ఫెయిల్ అయినట్లైతే ఆమెను మరలా తిరిగి జైలులో పెట్టమని జడ్డి ఫాక్స్ ఆదేశాలు జారీచేయడం జరిగింది. ఇలాంటి సమయంలో లిండ్సే లోహన్ మొన్న జరిగిన యమ్ టివి మ్యూజిక్ అవార్డులకు హాజరవ్వడం జరిగింది. యమ్ టివి మ్యూజిక్ అవార్డులకు హాజరయ్యే ముందు కూడా తను డ్రగ్ టెస్ట్ చేయించుకోవడం జరిగిందని లిండ్సే లోహన్ వివరించారు. ఈ డ్రగ్ టెస్ట్ లిండ్సే లోహన్ ఫెయిల్ అయిన విషయం అందరికి తెలిసిందే.

    దీనికి గాను జడ్జి ఎల్డన్ ఫాక్స్ మాట్లాడుతూ మొన్న జరిగినటువంటి కోకైన్ మరియు ఎంఫటామైన్స్ టెస్ట్ లలో లిండ్సే లోహన్ ఫెయిల్ అవ్వడం వల్ల లిండ్సే లోహన్ మీద అరెస్ట్ వారెంట్ ఇవ్వడం జరిగింది. ఈ అరెస్ట్ వారెంట్ శుక్రవారం పోద్దున 8.30నిమిషాల వరకు ఉంటుందని, ఈ లోపల లిండ్సే లోహన్ కోర్టులో హాజరైతే బాగుంటుందని ఆయన అన్నారు. కోర్టులో హాజరు అవ్వని పక్షంలో ఆమెను అరెస్టు చేయవలసిందిగా ఆయన చెప్పడం జరిగింది. ఫెయిల్ అయిన ఒకో టెస్ట్ కి 30 రోజుల పాటు అదనంగా జైలు శిక్ష విధించనున్నట్లు ఆయన వివరించారు. కాని లిండ్సే తాను మానసికంగా, శారీరకంగా పూర్తి ఆరోగ్యంగా వున్నానని వివరణ ఇచ్చింది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X