ఇక మీదట మహాత్మా గాంధీ అడుగు జాడల్లో నడుస్తానంటున్న హీరోయిన్
జనవరి 3న జైలు నుండి విడుదలైనటువంటి డ్రగ్స్ తార లిండ్సేలోహన్ మొదటి సారిగా తన ట్విట్టర్ లోచేసినటువంటి ట్వీట్ ఏమని తెలుసా ఇక మీదట తాను మన జాతిపిత మహాత్మాగాంధీ అడుగు జాడల్లో నడుస్తానని చెప్పడమే. నవంబర్ తర్వాత తన ట్విట్టర్ లోచేసినటువంటి మొదటి పోస్ట్ ద్వారా తనలో మార్పు వచ్చిందని తన అభిమానులకు తెలిసేవిధంగా మాట్లాడారు.
ఈరోజు నాజీవతంలో మరిచిపోలేని రోజరన్నారు. ప్రస్తుతం నేను చేస్తున్న పనులను బట్టే నారోబోయే రోజులు ఉంటాయని మహాత్మా గాంధీ చెప్పినటువంటి చక్కని మాట నాజీవితానికి సరిపోతుందన్న్రారు. లిండ్సే లోహాన్ డ్రగ్స్ తీసుకోని బెట్టీ ఫోర్డ్ సెంటర్ ట్రీట్ మెంట్ కువెళ్శి పూర్తిగా కోలుకున్న తర్వాత చేస్తున్నటువంటి మొట్టమొదటి ట్విట్టర్ ట్రీట్ కావడంతో దీనికి చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇక పోతే లిండ్సే లోహాన్ అభిమానులు కూడా లిండ్సే లోహాన్ కూడా ఇక నుంచి తన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ట్విట్టర్ ద్వారా తెలియజేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











