మరలా నన్ను జైలులో పెడతారేమోనంటున్న హీరోయిన్..!
లిండ్సే లోహాన్ హాలీవుడ్ లో హాట్ హాట్ గా వినిపిస్తున్న పేరు. గత కొన్నిరోజులుగా యావత్ ప్రపంచం మొత్తం ఈమె ప్రవర్తనను గమనిస్తున్నారు. దానికి కారణం డ్రగ్స్ టెస్టే ఫెయిల్ అవ్వడమే. ఇటీవల కాలంలో లిండ్సే లోహాన్ భారీగా డ్రగ్స్ తీసుకోని పోలీసులుకి దోరికిపోవడం దానితో లిండ్సే లోహాన్ ని జైలులో పెట్టడం అటుతర్వాత రిహాబ్ కు తరిలించడం మనఅందరికి తెలిసిందే.
తర్వాత లిండ్సే లోహాన్ ను డ్రగ్స్ టెస్టులకి హాజరవ్వమని జడ్జి ఎల్డన్ ఫాక్స్ ఆదేశించడం, ఆ కోకైన్ మరియు ఎంఫటామైన్స్ టెస్ట్ లలో లిండ్సే లోహన్ ఫెయిల్ అవ్వడం వల్ల లిండ్సే లోహన్ మీద అరెస్ట్ వారెంట్ ఇవ్వడం జరిగింది. ఈ అరెస్ట్ వారెంట్ శుక్రవారం పోద్దున 8.30నిమిషాల వరకు ఉంటుందని, ఈ లోపల లిండ్సే లోహన్ కోర్టులో హాజరైతే బాగుంటుందని ఆయన అన్నారు. కోర్టులో హాజరు అవ్వని పక్షంలో ఆమెను అరెస్టు చేయవలసిందిగా ఆయన చెప్పడం జరిగింది. ఫెయిల్ అయిన ఒకో టెస్ట్ కి 30 రోజుల పాటు అదనంగా జైలు శిక్ష విధించనున్నట్లు ఆయన వివరించిన సంగతి అందరికి తెలిసిందే.
దానితో లిండ్సే లోహాన్ ను జైలు లో పెడతారని భయం పట్టుకుంది. కాలిఫోర్నియాలోని సెంచురి రీజినల్ డిటెక్షన్ ఫెసిలిటీ కి లిండ్సే లోహాన్ ను తరిలించనున్నట్లు జడ్డి వివరించడం జరిగింది. దాంతో అక్కడున్న వారు లిండ్సే లోహాన్ కి తిక్కబాగా కుదిరింది. లేకపోతే తనకి రెండు సార్లు అవకాశం ఇచ్చి మరి ఉపయోగించుకోమంటే దానిని దుర్వినియోగపరచింది. కాబట్టి లిండ్సే లోహాన్ ను తప్పకుండా మరలా జైలులో పెట్టడం మంచిదని ఆమె విరోధులు కోరుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











