twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యమ్ టివి వీడియో మ్యూజిక్ అవార్డులలో మెరిసిన డ్రగ్స్ తార..!

    By Nageswara Rao
    |

    లండన్: హాలీవుడ్ నటి, పాప్ సింగర్ మరియు మోడల్ లిండ్సే లోహన్ మితిమీరి డ్రగ్స్ తీసుకోవడ వల్ల 14 రోజుల జైలు శిక్ష తోపాటు 23 రోజులు పాటు తన ఆరోగ్యం కోలుకోవాలని పెషంట్ గా ఉంచండం మన అందరికి తెలిసిన విషయమే. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉండడం వల్ల ఆదివారం లాస్ ఏంజెల్స్ లోని నోకియా ధియేటర్ లో జరిగినటువంటి యమ్ టివి వీడియో మ్యూజిక్ అవార్డులలో తళుక్కున మెరిశారు. లిండ్సే లోహన్ రిహార్సల్స్ జరుగుతున్నటువంటి చోటుకి వెళ్శి వారియొక్క ఏ విధంగా డాన్సులు చేస్తున్నారు అనే విషయం పై ఆరా తీశారని అక్కడ డాన్స్ రిహార్సల్స్ చేస్తున్నటువంటి జస్టిన్ బైబర్ మరియు మారి జే బ్లిజ్ వివరించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి చెల్సియా హాండ్లర్ మాట్లాడుతూ ప్రస్తుతం కోన్ని ఇబ్బందులలో ఉన్న నా స్నేహితురాలు లిండ్సే లోహన్ ఇక్కడకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని వెల్లడిచారు.

    ఈ యమ్ టివి వీడియో మ్యూజిక్ అవార్డుల షో కి వచ్చేముందు లిండ్సే లోహన్ శాంతా మోనికా కోర్డుహౌస్ కి తన ప్రోబెషన్ ఆఫీసర్ తో వెళ్శి డ్రగ్ యూరిన్ టెస్ట్ చేయించుకోని వచ్చానని లిండ్సే లోహన్ వెల్లడించారు. అంతేకాకుండా ప్రస్తుతం నా ఆరోగ్యం అంతా బాగానే ఉందని, త్వరలోనే మరలా సినిమాలలో నటిస్తానని వెల్లడించారు. నా కెరీర్ ని మరలా నేను నిలబెట్టుకోవాలనే యోచనలో ఉన్నట్టు ఆమె తెలిపారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X