జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు మనల్ని మారుస్తాయంటున్నసింగర్
పోయిన సంవత్సరం మిస్ క్యారెజీ వల్ల తన ప్రెగ్నెన్సీని కోల్పోయినటువంటి సింగర్ లిల్లీ అలెన్ మొట్టమొదటి సారి మీడియా ముందుకి రావడం జరిగింది. తన బాయ్ ప్రెండ్ శ్యామ్ కూపర్‌తో గడపడం వల్ల తనకు ఆరు నెలలు ప్రెగ్నెన్సీ వచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్రెగ్నెన్సీ పోయిన నవంబర్‌లో లిల్లీ అలెన్ మిస్ క్యారెజీ వల్ల కొల్పోవాల్సి వచ్చింది. అలా చాలా రోజులు మీడియాకి దూరంగా ఉన్నటువంటి సింగర్ లిల్లీ అలెన్ మొట్టమొదటిసారి మీడియా ముందు మాట్లాడడానికి అంగీకరించారు.
ఈ సందర్బంలో సింగర్ లిల్లీ అలెన్ మాట్లాడుతూ నిజంగా అది నా జీవితంలో మరచిపోలేనటువంటి సంఘటన. ఇలాంటి సంఘటనలే మనుషులను మారుస్తాయని నాకు అనిపించిందని అన్నారు. అలా తన బాధను పంచుకున్నారు. ఇది మాత్రమే కాకుండా ఇటీవల కాలంలో లిల్లీ అలెన్ ఓ టివి షోకి వచ్చినప్పుడు తాను త్వరలోనే సింగర్ కెరియర్ నుండి బట్టల బిజినెస్ లోకి అడుగు పెట్టబోతున్నట్లు తన సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











