కాక్ టెయిల్ పార్టితో తన స్నేహాన్ని మెరుగుపరచుకున్న హీరో..!
ఇంగ్లీషు సింగర్ లిల్లి అలెన్ కిమరియు సర్ ఎల్టాన్ జాన్ కిచాలా అవినాభావ సంబంధం ఉంది. ఈ అవినాభావ సంబంధంతోనే లిల్లి అలెన్ ఈసంవత్సరం జరుగనున్న వింటర్ బాల్ కార్యక్రమంలో తన పెర్మామెన్స్ ను ప్రదర్శిస్తానని చెప్పడం జరిగింది. 2008 సంవత్సరంలో జరిగినటువంటి జిక్యూ మెన్ ఆప్ ద ఇయర్ అవార్దుల కార్యక్రమంలో ఇద్దరూ కలసి రెడ్ కార్పెట్ మీద నడచి అందరిని ఆశ్యర్యంలో ముంచెత్తారు.
గతంలో కూడా తన ప్రేమను సర్ ఎల్టాన్ జాన్ ఓ వినూత్నమైన రీతిలో తెలిపారు. దానికి గాను లిల్లి అలెన్ నికిడ్నాప్ చేసి మరి తన ప్రేమను తెలిపారు. దాంతో మనస్తాపానికి గురైన లిల్లి అలెన్ అప్పటి నుండి సర్ ఎల్టాన్ జాన్ తోమాట్లాడడం మానివేశారు. దీనికి గాను సర్ ఎల్టాన్ జాన్ మరలా తనతో మాట్లాడడం కోసం 2009లో పెద్ద కాక్ టెయిల్ పార్టీని ఏరెంజ్ చేసి వాళ్శ ఇద్దరి మద్యనున్న విభేదాలను పోగోట్టారు.
ఇక దీనితో సర్ ఎల్టాన్ జాన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అంతేకాకుండా వీరి స్నేహానికి లిల్లి అలెన్ ఈ సంవత్సరం జరుగునున్న వింటర్ బాల్ కార్యక్రమంలో తన పెర్మామెన్స్ ను ప్రదర్శిస్తానని అన్నారంట. ప్రస్తుతం ప్రెగ్నంట్ గానున్న లిల్లి అలెన్ తను ఇచ్చే ప్రదర్శన ఓ రేంజిలో ఉంటుందని అన్నారు.


Click it and Unblock the Notifications











