లవ్ ను ప్రపోజ్ చెయ్యగానే కళ్శ వెంట నీళ్శు పెట్టుకున్న పాప్ స్టార్
పాప్ స్టార్ లిల్లీ అలెన్ మరోసారి వార్తల్లో నిలచారు. దీనికి కారణం న్యూయార్క్ లో సీక్రెట్ గా ఎవ్వరికీ తెలియకుండా తన సోగసుగాడు అయినటువంటి శామ్ కూపర్ ను పెళ్శి చేసుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకు బలం చేకూర్చే విధంగా తను న్యూయార్క్ నుండి లండన్ వచ్చిన తర్వాత లిల్లీ అలెన్ తన బ్లాగులో ఒక పిక్చర్ పోస్ట్ చేయడం జరిగింది. ఈ పిక్చర్ వల్లే లిల్లీ అలెన్ ఇప్పుడు వార్తల్లోకి రావడం జరిగింది. ఇంతకీ ఈ పిక్చర్ లో ఏముందని అనుకుంటున్నారా.. ఏమిలేదండీ ఈ ఫోటోలో లిల్లీ అలెన్ తన చేతికి రెండు వెడ్డింగ్ రింగులు ధరించి ఉండడంతో లిల్లీ అలెన్, శామ్ కూపర్ ఇద్దరూ సైలెంట్ గా న్యూయార్క్ లో పెళ్శి చేసుకున్నారని వార్త ప్రస్తుతం లండన్ లో వీధుల్లో సంచరిస్తుంది.
ఇది మాత్రమే కాకుండా లిల్లీ అలెన్ తన బ్లాగులో ఉంచినటువంటి ఆఫోటో క్రింద ఓ టాగ్ లైన్ కూడా రాసి ఉంది. దానితో లిల్లీ అలెన్ అభిమానులు ఈ పెళ్శిని నమ్మడం జరుగుతుంది. మొన్న బాలీ లో జరిగినటువంటి క్రిస్టమస్ ఈవెంట్స్ లో లిల్లీ అలెన్ మంచి ఆనందంలో మునిగితేలుతుండగా, శామ్ కూపర్ సైలెంట్ గా లిల్లీ అలెన్ వద్దకు వెళ్శి ప్రపోజ్ చేయడం జరిగిందంట. దానితో లిల్లీ అలెన్ కు కళ్శ వెంట ఒక్కసారి గిర్రున నీళ్శు తిరిగి శామ్ కూపర్ ప్రపోజ్ కు ఓకె చెప్పిందని సమాచారం.


Click it and Unblock the Notifications











