తనని తాను హింసించుకుంటున్న స్టార్ నటీమణి..!!
అమెరికాకు చెందిన నటి, మోడల్, సింగర్ లిండ్సే లోహన్ మరో సారి తనని తాను హింసించుకుంటోంది అనే వార్తలు ప్రీ గోల్డెన్ గ్లోబ్స్ పార్టీలో గుప్పుమన్నాయి. ఈ 23 ఏళ్ల యువ నటి ఇటీవల జరిగిన పార్టీకి వచ్చినప్పుడు ఆమె చేతికి గాయం అయివుండటం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇది చూసిన వారు లిండ్సే మరో సారి డిప్రెషన్ లోకి వెళ్లిపోయి, దాన్నుండీ బయటపడటానికి ఇదివరకటి లాగా మరో సారి హింసా మార్గాన్ని ఎన్నుకుందని అభిప్రాయపడ్డారు.
ఇది ఆ చెవిన ఆ చెవిన పడి లిండ్సే చెవిన కూడా పడింది. దీంతో లిండ్సే తాను మానసికంగా, శారీరకంగా పూర్తి ఆరోగ్యంగా వున్నానని వివరణ ఇచ్చింది. ఈ గాయం నేను చిన్నవయసులో వున్నప్పుడు ఓ ఆపరేషన్ వల్ల ఏర్పడిందని స్పష్టం చేసింది. ఎంతో కాలంగా ఈ గాయం తాలూకు ఆనవాళ్లు నా చేతిమీద వుండగా ఇప్పుడు మాత్రం వాటిని గుర్తించి లేనిపోని వార్తలు పుట్టించడం సబబు కాదని హితవు పలికింది. అంతే కాదు ప్రజలు ఎన్నో రకాల అసౌకర్యాలతో ఇబ్బందులు పడుతుంటే, వాటిని చూపించకుండా ఇలాంటి పిచ్చి వార్తలకు మీడియా ప్రాధాన్యం ఇవ్వడాన్ని తప్పుబట్టారు. నీలాంటి వాళ్లని వదిలేస్తే మీడియాతకు వార్తలెలా దొరుకుతాయి లిండ్సే..!!


Click it and Unblock the Notifications











