twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈ పరిస్దితుల్లో నన్ను నేను ప్రేమించుకోవడం ముఖ్యం

    By Nageswara Rao
    |

    లిండ్సే లోహాన్ హాలీవుడ్‌లో ఈ పేరు అందరికి సుపరిచితం. అందుకు కారణం ఎల్లప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. లిండ్సే లోహాన్ డ్రగ్స్ తీసుకోని కొన్నాళ్శు జైలు శిక్ష కూడా అనుభవించింది. మరికొన్నాళ్శు గృహా నిర్బందం కూడా చేయబడింది. తన యొక్క గృహా నిర్బందం విశేషాలను తెలియజేస్తూ నేను చాలా వరకు నా గృహా నిర్బందం రోజులను బాగా ఎంజాయ్ చేశాను. మొత్తం నన్ను 35రోజులు గృహా నిర్బంధం చేయడం జరిగింది. అన్ని రోజులు కూడా నేను ఎంజాయ్ చేయడానికి కారణం పబ్లిక్‌కు కళ్శు నా మీద పడకపోవడమేనని అన్నారు.

    లిండ్సే లోహాన్ వయసు ప్రస్తుతం 25 సంవత్సరాలు. ఈ వయసులో అనవసరపు వ్యసనాలకు బానిసై గృహా నిర్బంధం కావాల్సి వచ్చింది. డ్రగ్స్ కేసులో లిండ్సే లోహాన్‌ని విచారించిన కోర్టు తనని రిహాబ్‌కు తరలిండమే కాకుండా కాలిపోర్నియాలోని ఇంట్లో ఉంచడం జరిగింది. ఆ సమయంలో లిండ్సే లోహాన్ ఖాళీగా ఉండకుండా ఏదో తన పని తాను చేసుకున్నట్లు చెప్పారు. ఇంట్లో ఉండి కూడా తాను హ్యాపీగా ఉండడానికి కారణం బయట కెమెరాలు లేకపోవడమేనని తెలిపారు.

    మీన్ గర్ల్స్ స్టార్ అయినటువంటి లిండ్సే లోహాన్‌కి జూన్ 29న కోర్టు 480 గంటలు లాస్ ఏంజిల్స్ డౌన్ టౌన్ ఉమెన్స్ సెంటర్‌లో కమ్యూనిటీ సర్వీస్ శిక్షను కూడా వేయడం జరిగింది. ప్రస్తుతం తన జీవితంలో జరిగిన గతాన్ని మరచిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే లిండ్సే లోహాన్ త్వరలో గోటి: త్రి జనరేషన్స్ అనే సినిమాలో నటించడానికి గాను సంతకం కూడా చేసినట్లు సమాచారం. ఈసినిమా వచ్చే సంవత్సరం మొదలవుతుందని అన్నారు.

    మీ జీవితంలో ప్రేమకు ఏమైనా చోటిచ్చారా అని ప్రశ్నించగా అందుకు గాను లిండ్సే లోహాన్ ప్రస్తుతం నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఒకవేళ ఎవరైనా నా మనసులో ఉన్నప్పటికీ నేను మాత్రం బయటకు వెల్లడించను. ప్రస్తుతం ఉన్న పరిస్దితులలో నన్ను నేను ప్రేమించుకోవడం అనేది నాకు ఎంతో ముఖ్యం అని అన్నారు.

    English summary
    Troubled star Lindsay Lohan claims she enjoyed her stint under house arrest because it helped her to stay out of the public eye.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X