చెల్లిని పాడు చేస్తున్న లిండ్సే లోహన్‌

By Staff

అమెరికన్ నటి, మోడల్, పాప్ సింగర్ లిండ్సే లోహన్ ఈ మధ్యన విపరీతంగా ప్రవర్తిస్తోందట. డిస్నీ పిక్చర్స్ 'ది పేరెంట్ ట్రాప్' చిత్రం ద్వారా పరిచయమైన లిండ్సే లోహన్‌ చేషలకు తెలిసిన వారు ముక్కుమీద వేలేసుకుంటున్నారు. అంత పని ఏం చేసింది అంటారా, పట్టుమని పదిహేనేళ్లు కూడా లేని తన చెల్లెల్ని వెంటేసుకుని నైట్‌ క్లబ్‌లకు, మందు పార్టీలకు వెళ్తోందట లిండ్సే. అంతే కాదు ఆ వయసు పిల్లలను మరెవరూ తీసుకుని వెళ్లకూడని చోటికి ఆమె తీసుకెళ్తోంది. ఇది చూసిన వారంతా ఆమెను విమర్శిస్తున్నారట. తను చెడిపోవడం కాకుండా తన చెల్లిని కూడా చెడిపేస్తోందని దెబ్బిపొడుస్తున్నారట.

దీని గురించి లిండ్సే మాట్లాడుతూ ''నా చెల్లెలు అలీ నాకంటే చాలా తెలివైంది. మీరు అనుకునేంత భయస్తురాలేంకాదు. ఆమెది చాలా స్ట్రాంగ్‌మైండ్‌. ఎలాంటి పరిస్థితినైనా చాకచక్యంగా ఎదుర్కొనే సామర్ధ్యం నాకంటే ఆమెకే ఎక్కువగా ఉంది. అయినా బయటవారిని తీసుకు వెళ్తే తప్పుకాని. నా చెళ్లెల్ని తీసుకు వెళ్తే మీకేంటిట..?" అంటూ ఆమె ఎదురు ప్రశ్నిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X