నేను ఫ్రీ బర్డ్ అవుతున్నానోచ్...?
లిండిసే లోహాన్ 2007లో మూడు సార్లు డ్రగ్స్ మరియు రెండు సార్లు రోడ్డుప్రమాదాలు చేసి వార్తల్లోకి ఎక్కారు. లిండిసే లోహాన్ అమెరికాలో ప్రముఖ సింగర్, మంచి మోడల్ కూడా. 2007 తర్వాత కోంచం సినిమా అవకాశాలు తగ్గిపోగా, తమ మనోధైర్యం కోల్పోకుండా 2008లో అగ్లీ బెట్టీ అనే టివి సీరియల్ లో నటించి మరలా తన నటనా విశ్వరూపాన్ని చూపించారు. అలా మరలా తన అభిమానులను తిరిగిసంపాదించుకోగలిగారు.
లిండిసే లోహాన్ కు డ్రగ్స్ కేసు విషయంలో కోర్టు 90 రోజులు జైలు శిక్ష విధించారు.తన సత్ ప్రవర్తనకు 14 రోజులు తర్వాత తనని విడుదల చేయడం జరిగినది. దీనికి కారణం లేకపోలేదు జైలులో వున్న రద్దీని కూడా కోంచెం తగ్గించినట్లుందని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.లిండిసే లోహాన్ సంబంధించిన లాయర్ షాన్ చాప్మాన్ మాట్లాడుతూ మాకు ఈ నిర్ణయం మాకు చాలా ఆశ్ఛర్యం కలిగించిందన్నారు.


Click it and Unblock the Notifications











