Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
'వైట్‌హౌస్ ప్రతినిధుల డిన్నర్'లో సెక్సీ తార
హాలీవుడ్ స్టార్ హీరోయిన్, సెక్సీ తార లిండ్సే లోహన్ ఈ సంవత్సరం 'వైట్ హౌస్ ప్రతినిధుల డిన్నర్' హాజరుకానుందని సమాచారం. శనివారం జరగనున్న ఈ 'వైట్ హౌస్ ప్రతినిధుల డిన్నర్' కి గాను అమెరికా ప్రెసిడెంట్ బరాక్ ఒబామాతో పాటు భార్య మిచెల్లీ ఒబామా దేశంలో వివిధ రంగాలలో నిష్ణాతులైన ప్రముఖలను ప్రతి సంవత్సరం ఈ డిన్నర్‌కు కొంత మంది స్టార్స్‌ని ఆహ్వానిస్తుంటారు.
ఈ సంవత్సరం జరగనున్న 'వైట్ హౌస్ ప్రతినిధుల డిన్నర్'కి ఆస్కార్ విన్నింగ్ హీరో డానియల్ డే లూయిస్ తో పాటు.. డిస్పరేట్ హాస్ వైఫ్స్ హీరోయిన్ ఇవా లంగోరియాని కూడా ఆహ్వానించారు. లిండ్సే లోహన్ అధికార ప్రతినిధి స్టీవ్ హోయింగ్ ఓ ప్రముఖ వెబ్‌సైట్‌కి 'వైట్ హౌస్ ప్రతినిధుల డిన్నర్' కార్యక్రమానికి లిండ్సే లోహన్ హాజరవుతారని తెలిపాడు.
ఇదే కార్యక్రమానికి లిండ్సే లోహన్ తో పాటు చార్లెజ్ థెరాన్, వియోలా డేవిస్, రీస్ విథర్స్పూన్ లాంటి హాలీవుడ్ మాహామహులు హాజరుకానున్నారు. వీరితో పాటు జెస్సికా ఆల్బా తన భర్తతో కలసి ఏప్రిల్ 28వ తారీఖున శ్వేత సౌధంలోకి వార్షిక ప్రతినిధులు డిన్నర్‌కి వెళ్లనుంది. ఈ వార్షిక ప్రతినిధులు డిన్నర్‌కి జెస్సికా ఆల్బా భర్త క్యాష్ వార్రెన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇదే రోజు జెస్సికా ఆల్బా పుట్టినరోజు కలసి రావడంతో తన పుట్టినరోజుని శ్వేత సౌధంలో జరుపుకోనున్నట్లు అందరికి డప్పు వేసి మరీ చెబుతుంది.
ఆల్బా ఇటీవల ఓ ఇంటర్యూలో ఏప్రిల్ 28న నేను వాషింగ్టన్ డిసి వెళుతున్నాను. ఆరోజు శ్వేత సౌధంలో వార్షిక ప్రతినిధులు డిన్నర్ ఉంది. ఆ డిన్నర్‌తో పాటు నా పుట్టిన రోజుని అక్కడే జరుపుకుంటానని తెలియజేశారు.