సెక్సీ హీరోయిన్ కొత్త 'పచ్చ బొట్టు' అదిరింది..!
ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే లిండ్సే లోహాన్ మరలా వార్తల్లోకి వచ్చారు. 25 సంవత్సరాల వయసు కలిగిన ఈ స్టార్ హీరోయిన్ ఈ సారి తన మణికట్టుపై 'Live Without Regrets' అంటూ టాటూ(పచ్చబొట్టు)ని పొడిపించుకున్నారు. ఇప్పుడు సడన్‌గా లిండ్సే లోహాన్ ఈ టాటూ పొడిపించుకోవడానికి గల కారణాలు ఏంటనేది తెలిసి రాలేదు. 'Live Without Regrets' అనే పదానికి అర్దం 'విచారం లేకుండా జీవించు' అన్నమాట.
గతయేడాది లిండ్సే లోహాన్ డ్రగ్స్ తీసుకొని, జైలుకెళ్ళడం, ఆ తర్వాత రిహాబ్ సెంటర్‌కి కూడా వెళ్లారు. 2012 జనవరి 6న లిండ్సే లోహాన్ టాటూ పార్లర్‌కి వెళ్లి తన చేతి మణికట్టు మీద 'విచారం లేకుండా జీవించు' టాటూని వేయించుకున్నారని తన స్నేహితులు తెలిపారు. లిండ్సే లోహాన్ ఇలా తన చేతిపై ఇలా టాటూ వేయించుకొవడానికి గల కారణం గతంలో తాను అనుభవించిన పాత జ్ఞాపకాలను మరిచిపోయేందుకేనని అన్నారు.
గతంలో లిండ్సే లోహాన్ పలు మార్లు టాటూలు వేయించుకున్నప్పటికీ ఈ టాటూ చాలా ప్రత్యేకంగా ఉందని అంటున్నారు హాలీవుడ్ ప్రముఖులు. 2009వ సంతవ్సరంలో తన బాయ్ ప్రెండ్ సమంతా రాన్‌సన్ నుండి విడిపోయినప్పుడు లిండ్సే లోహాన్ తన కుడి చేతి మణికట్టు లోపల భాగాన హాలీవుడ్ రాణి మార్లిన్ మన్రో సందేశం “I restore myself when I'm alone" ని గతంలోనే వేయించుకున్న సంగతి తెలిసిందే. తన వీపు వెనుక భాగాన “La Bella Vita" టాటూని కూడా గతంలో మనం చూశాం.


Click it and Unblock the Notifications











