లిండ్సే గురించి అమె తల్లి ఆవేదన
హాలీవుడ్ నటి, పాప్ సింగర్ లిండ్సే లోహన్ గురించి రోజుకో వదంతి పుట్టుకొస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె తండ్రి ఆమెకు సంబంధించిన రహస్య వీడియోలు బయటపెట్టిన సంగతి తెలిసిందే. అలాంటి సంఘటనే మరో సారి చోటుచేసుకొంది. ఈ దఫా లిండ్సే లోహన్ తల్లి దినా, ఆమె తండ్రి మైఖేల్ ల మధ్య జరిగిన ఫోను సంభాషనలు లీకయ్యాయి. ఈ సంభాషనల్లో లిండ్సే తనని తాను ఎలా హింసించుకొంటున్న సంగతిని దినా, ఆమె భర్త మైఖేల్ కు వివరిస్తోంది. ఉద్వేగపూరితంగా జరిగిన ఈ సంభాషనల సారాంశం ఈ విధంగా వుంది.
తొలుత మైఖేల్ కు ఫోన్ చేసిన దియా కన్నీటితో నిండిన కళ్లతో, దగ్ధధస్వరంలో తన 23 ఏళ్ల కూతురు లిండ్సే లోహన్ గురించి మాట్లాడింది. లిండ్సే తనని తాను చిత్రహింసలు పెట్టుకుంటోందని, తమ కూతురు చెయ్యి దాటిపోతోందని ఆవేదన వ్యక్తం చేసింది. తన కూతురికి ఏదైనా దరగరానిది జరిగితే అది నీ తప్పేనని మైఖేల్ కు చెప్పింది. అసలు లిండ్సే ఇలా తయారవడానికి నువ్వే కారణం అని రోదిస్తూ తన బాధను వ్యక్తం చేసింది. లిండ్సే వివాదాస్పద వీడియోను పబ్లిక్ చేసిన radaronline.com వారే ఈ ఫోను సంభాషనలను విడుదలచెయ్యడం గమనార్హం.


Click it and Unblock the Notifications