రిహాబ్ సెంటర్ నుండి జనవరి 4న బయటకు రానున్న డ్రగ్స్ తార
ఇటీవల కాలంలో డ్రగ్స్ వివాదంలో చిక్కుకున్న మీన్ గర్ల్స్ హీరోయిన్ మరియు హాలీవుడ్ సెక్స్ బాంబ్ లిండ్సే లోహాన్. లిండ్సే లోహాన్ భారీగా డ్రగ్స్ తీసుకోని పోలీసులుకి దోరికిపోవడం దానితో లిండ్సే లోహాన్ ని జైలులో పెట్టడంతోపాటు, లిండ్సే లోహన్ మితిమీరి డ్రగ్స్ తీసుకోవడ వల్ల కోర్టు ఆదేశాల మేరకు 14 రోజుల జైలు శిక్ష తోపాటు 23 రోజులు పాటు తన ఆరోగ్యం కోలుకోవాలని పెషంట్ గా రిహాబ్ కోసం న్యూయార్క్ లోని బెట్టి ఫోర్డ్ సెంటర్ కు తరలించిన విషయం మన అందరికి తెలిసిందే.
ఐతే ఈరిహాబ్ ట్రీట్ మెంట్ జనవరి 3వ తారీఖుతో గడువు ముగుస్తుండడంతో లిండ్సే లోహాన్ నువిడుదల చేయడానికి రిహాబ్ సెంటర్ వారు సన్నాహాలు చేస్తున్నారు. ఈసందర్బంలో లిండ్సే లోహాన్ మాట్లాడుతూ జనవరి 3వతారీఖుతో నాట్రీట్ మెంట్ పూర్తి అవుతుంది. ఐతే నేను 3వ తారీఖునే బయటకు వెళ్శకుండా ఒక్కరోజు అదనంగా ఉండాలని నిర్ణయించుకున్నానని అన్నారు. దీనికి కారణం రిహాబ్ సెంటర్ లోవైద్యులు నాపై చూపించినటువంటి ప్రేమ. అంతేకాకుండా నాకు త్వరగా కోలుకోవాలని వారునాపై చూపినటువంటి ప్రత్యేక శ్రద్ద వల్లనే ఈనిర్ణయం తీసుకున్నానని అన్నారు.
ఇదే సందర్బంలో డాక్టర్స్ మాట్లాడుతూ లిండ్సే లోహాన్ ఇక్కడ ఉన్నటువంటి అన్ని రోజులు మాతో బాగా కలసిపోయారు. అది మాత్రమే కాకుండా తను బయటకు వెళ్శిన తర్వాత కూడా మావంతు సహాకారం లిండ్సే లోహాన్ కుఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. తన ప్రతిరోజు జీవిత విధానాన్ని గమనించాల్సిన భాద్యత జడ్జి ఎల్డన్ ఫాక్స్ మాపై ఉంచారన్నారు.


Click it and Unblock the Notifications











