లేట్ నైట్ షోలో అందాలు ప్రదర్శనకు సిద్దమైన ఒకప్పటి స్టార్ హీరోయిన్
లేట్ నైట్ షోలకు ప్రసిద్దిగాంచినటువంటి షో డేవిడ్ లెటర్ మ్యాన్స్ షో. ఈ షో లో గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వాలని చాలా మంది తాపత్రయం. ఐతే ఈసారి అనుకోకుండా మీన్ గర్ల్స్ హీరోయిన్ లిండ్సే లోహాన్‌ను వరించింది. 2011గ్రామీ అవార్డులు సాధించినటువంటి పది టాప్ సెలబ్రిటీలకు లెటర్ మ్యాన్స్ ప్రత్యేకంగా షో ఏర్పాటు చేయడం జరిగింది. ఈషోలో లిండ్సే లోహాన్‌ని డాన్స్ చేయడానికి కూడా అంగీకరించిందని సమాచారం.
ఇటీవల కాలంలో లిండ్సే లోహాన్ మీద లాస్ ఏంజిల్స్ జ్యాయలరీ షాపులో కొట్ల రూపాయల విలువ కలిగేటటువంటి నక్లెస్ దోంగతనం చేసిందంటూ కేసు పెట్టడం జరిగింది. ఆకేసు పరిశీలన ఉండగానే లిండ్సే లోహాన్ ఈ డేవిడ్ లెటర్ మ్యాన్స్ నైట్ షోలో చిందేయడానికి ఒప్పకున్నారంటే ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తున్నట్లు తెలిపారు. దీనికి కారణం కూడా లేకపోలేదని అంటున్నారు ప్రముఖులు. లిండ్సే లోహాన్ ప్రస్తుతం చేసేటటువంటి పెర్పామెన్స్ న్యూయార్క్‌కు సంబంధించినటువంటి రియాలిటీ షో అని పరిశీలకులు అంటున్నారు.


Click it and Unblock the Notifications











