డ్రగ్స్ తీసుకోవడం వల్లే అలాజరిగింది..!
అమెరికాకు చెందిన నటి, మోడల్, సింగర్ లిండ్సే లోహన్ మరో సారి తనకున్న పార్టీ ఇమేజిని తిరిగి సంపాదించు కుంటానంటుంది. ఈ 23 ఏళ్ల యువ నటి ఇటీవల జరిగిన పార్టీకి వచ్చినప్పుడు ఆమె చేతికి గాయం అయివుండటం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ గాయం నేను చిన్నవయసులో వున్నప్పుడు ఓ ఆపరేషన్ వల్ల ఏర్పడిందని స్పష్టం చేసింది. ఇంతకు ముందు మితిమీరి డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఆమె ఆస్పత్రిపాలయిన విషయం తెలిసిందే. లిండ్సే లోహన్ మాట్లాడుతూ నా కెరీర్ ని మరలా నేను నిలబెట్టుకోవాలి. నేను మరలా సినిమాలలో నటించాలి.
ఇటీవల కాలంలో లిండ్సే లోహన్ డ్రగ్స్ తీసుకోవడ వల్ల 14 రోజుల జైలు శిక్ష తోపాటు 23 రోజులు పాటు తన ఆరోగ్యం కోలుకోవాలని పెషంట్ గా ఉంచారు. ప్రస్తుతం లిండ్సే తాను మానసికంగా, శారీరకంగా పూర్తి ఆరోగ్యంగా వున్నానని వివరణ ఇచ్చింది. ఇలా జరగడానికి కారణం నా చుట్టూ ఉన్న తప్పుడు మనుషులు. వీళ్శంతా కలసి నన్ను చెడుమార్గంలో నడిపించారు. నేను సంపాదించినప్పుడు ఎంతో మంది నా దగ్గర నుంచి దోచుకెళ్లారు కాని నేను ఆపదలో ఉన్నప్పుడు ఒక్కరు కూడా నాకు సహాయం చేయలేదని తన భాధను వ్యక్తపరిచారు. అంతే కాకుండా డ్రగ్స్ తీసుకోవడం వల్లే అలాజరిగిందని ఇక ఎప్పటికి తాను జీవితంలో డ్రగ్స్ తీసుకోనని వాపోయింది. లిండ్సే లోహన్ హాలీవుడ్ లో లియోనార్డో డికాప్రియో తో కోన్నాళ్సు ప్రేమాయణం కూడా సాగించింది.


Click it and Unblock the Notifications











