twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'స్కేరీ మూవీ 5' లో తొలిసారి నటించనున్న లిండ్సే లోహాన్

    By Nageswara Rao
    |

    లాస్ ఏంజిల్స్: ఎప్పుడూ వివాదాలలో కొనసాగే లిండ్సే లోహాన్ తొలిసారి "Scary Movie 5″ అనే హార్రర్ సిరిస్ సినిమాలో నటించనున్నారు. ఇక ఇదే సిరిస్‌లో హీరోగా రెండు సార్లు నటించిన చార్లీ షీన్ మూడోసారి హీరోగా ఈ సినిమా సిరిస్‌లో నటిస్తున్నాడు. ఈ సిరిస్‌లో మూడు, నాలుగు సినిమాలకు స్క్రిప్టు వ్రాసిన డేవిడ్ జూకర్ ఈ సినిమాకు స్క్రిప్టుని అందిస్తుండగా.. మెల్‌కామ్ లీ దర్శకత్వం వహిస్తున్నాడు.

    గతంలో వచ్చిన సిరిస్‌లలో ఈ సినిమా పూర్తిగా బాక్సాఫీసు రికార్డుల్ని నమోదు చేసింది. సుమారు ప్రపంచ వ్యాప్తంగా ఈ సిరిస్ సినిమాలు $800 మిలియన్ వసూలు చేశాయి. గతంలో ఈ సిరిస్‌లలో అన్నే ఫారిస్ నటించారు. ఇక "Scary Movie 5″ కథ విషయానికి వస్తే డాన్స్ ప్రపంచం చుట్టూ సాగుతుంది. ఒక పెద్ద డ్యాన్స్ కంపెనీని కొనసాగించే ఎవరికి లొంగని ఫ్రెంచ్ దర్శకుడు చుట్టూ సాగుతుంది.

    ఇక ఇటీవల లిండ్సే లోహాన్ కాలిఫోర్నియాలోని మెరినా డెల్ రే ప్రాంతంలో ఉన్న రిట్జ్-కార్ల్టన్ హోటల్‌లోని తన గదిలో కొంతసేపు స్పృహ తప్పారని సమాచారం. గత కొన్ని రోజులుగా లిండ్సే లోహాన్ 'లిజ్ అండ్ డిక్' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండడం వల్ల నిద్రలేమి, డీహైడ్రేషన్, అలసటతోనే అలా జరిగిందని తెలిపారు.

    'ఈ' వెబ్‌సైట్ తెలిపిన వివరాల ప్రకారం.. లిండ్సే శుక్రవారం రాత్రి ఏడు నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు ఏకధాటిగా షూటింగ్‌లో ఉన్నారు. దీంతో అలసటకు గురై హోటల్ గదిలో స్పృహ కోల్పోయారని ప్రచురించింది. ఆమె పరిస్థితిని గమనించిన లిజ్ అండ్ డిక్ సినిమా బృందంలోని సభ్యులు 911కి ఫోన్ చేయగా.. లిండ్సేను పరీక్షించిన వైద్యులు ఆమెకు ఎలాంటి అనారోగ్య సమస్యా లేదని తేల్చారు. ఈ విషయాన్ని లిండ్సే లోహాన్ తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

    తెలుగు వన్ఇండియా

    English summary
    Actress Lindsay Lohan is set to make her first appearance in “Scary Movie 5″. Joining her is actor Charlie Sheen, who will return for the third time.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X