Don't Miss!
- News లేడీ స్కూట్ టీచర్ ను ఎత్తుకెళ్లిన యువకుడు, జాతరకు వెళ్లిన టైమ్ లో ప్లాన్ చేసి, అంతేనా!
- Lifestyle చాణక్య నీతి : పొరపాటున కూడ భార్యకు ఈ 5 విషయాలు అస్సలు చెప్పకూడదు..!
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
'స్కేరీ మూవీ 5' లో తొలిసారి నటించనున్న లిండ్సే లోహాన్
లాస్ ఏంజిల్స్: ఎప్పుడూ వివాదాలలో కొనసాగే లిండ్సే లోహాన్ తొలిసారి "Scary Movie 5″ అనే హార్రర్ సిరిస్ సినిమాలో నటించనున్నారు. ఇక ఇదే సిరిస్లో హీరోగా రెండు సార్లు నటించిన చార్లీ షీన్ మూడోసారి హీరోగా ఈ సినిమా సిరిస్లో నటిస్తున్నాడు. ఈ సిరిస్లో మూడు, నాలుగు సినిమాలకు స్క్రిప్టు వ్రాసిన డేవిడ్ జూకర్ ఈ సినిమాకు స్క్రిప్టుని అందిస్తుండగా.. మెల్కామ్ లీ దర్శకత్వం వహిస్తున్నాడు.
గతంలో వచ్చిన సిరిస్లలో ఈ సినిమా పూర్తిగా బాక్సాఫీసు రికార్డుల్ని నమోదు చేసింది. సుమారు ప్రపంచ వ్యాప్తంగా ఈ సిరిస్ సినిమాలు $800 మిలియన్ వసూలు చేశాయి. గతంలో ఈ సిరిస్లలో అన్నే ఫారిస్ నటించారు. ఇక "Scary Movie 5″ కథ విషయానికి వస్తే డాన్స్ ప్రపంచం చుట్టూ సాగుతుంది. ఒక పెద్ద డ్యాన్స్ కంపెనీని కొనసాగించే ఎవరికి లొంగని ఫ్రెంచ్ దర్శకుడు చుట్టూ సాగుతుంది.
ఇక ఇటీవల లిండ్సే లోహాన్ కాలిఫోర్నియాలోని మెరినా డెల్ రే ప్రాంతంలో ఉన్న రిట్జ్-కార్ల్టన్ హోటల్లోని తన గదిలో కొంతసేపు స్పృహ తప్పారని సమాచారం. గత కొన్ని రోజులుగా లిండ్సే లోహాన్ 'లిజ్ అండ్ డిక్' సినిమా షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల నిద్రలేమి, డీహైడ్రేషన్, అలసటతోనే అలా జరిగిందని తెలిపారు.
'ఈ' వెబ్సైట్ తెలిపిన వివరాల ప్రకారం.. లిండ్సే శుక్రవారం రాత్రి ఏడు నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు ఏకధాటిగా షూటింగ్లో ఉన్నారు. దీంతో అలసటకు గురై హోటల్ గదిలో స్పృహ కోల్పోయారని ప్రచురించింది. ఆమె పరిస్థితిని గమనించిన లిజ్ అండ్ డిక్ సినిమా బృందంలోని సభ్యులు 911కి ఫోన్ చేయగా.. లిండ్సేను పరీక్షించిన వైద్యులు ఆమెకు ఎలాంటి అనారోగ్య సమస్యా లేదని తేల్చారు. ఈ విషయాన్ని లిండ్సే లోహాన్ తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
తెలుగు వన్ఇండియా