నేను నివసించే గదిలో ఏమి చేస్తానో చూడండంటున్న స్టార్ హీరోయిన్
హాలీవుడ్‌లో లిండ్సే లోహాన్‌ది ప్రత్యేక స్ధానం. డ్రగ్స్ తీసుకోని జైలు కెళ్శిన తర్వాత లిండ్సే లోహాన్ గృహా నిర్బంధం అయిన సంగతి తెలిసిందే. ఐతే ఈ సమయంలో ఖాళీగా ఉండడం ఎందుకులే అనుకుందేమో మన సెక్సీ సుందరి. ఇంకెందు ఆలస్యం అంటూ తన నివసిస్తున్నటువంటి రూమ్‌నే యాడ్స్ చేసేటటువంటి రూమ్‌గా మార్చేసింది. ఇంతకీ లిండ్సే లోహాన్ చేసినటువంటి యాడ్ దేనికోసం అని అనుకుంటున్నారా..? ఇంటర్నెట్‌కి సంబంధించినటువంటి ఓ ఆక్షన్ వెబ్‌సైట్ కోసం కమర్షియల్ యాడ్‌ని రూపోందిస్తుంది.
లిండ్సే లోహాన్ చేసినటువంటి ఈ యాడ్ కేవలం పదహేను నిమిషాలు పాటు ప్రదర్శన వస్తుంది. ఇందుకుగాను మీన్ గర్ల్స్ స్టార్ అయినటువంటి లిండ్సే లోహాన్ అధిక మొత్తంలోనే డబ్బులు తీసుకున్నట్లు సమాచారం. లిండ్సే లోహాన్ స్వయంగా ఈ విషయాన్ని తన సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్‌లో ప్రస్తావించింది. అందులో నా ప్రెండ్స్ అందరికి హాయ్ చెబుతున్నాను. నేను ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఏమి చేస్తానో అనేది ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. నేను ఖాళీగా ఉన్నప్పుడు ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తుంటే నాకోక బ్రహ్మాండమైనటువంటి మంచి డీల్స్ ఉన్న వెబ్‌సైట్ కనిపించిందని తన సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ లో రాశారు. ఈ యాడ్‌లో నటించినందుకుగాను లిండ్సే లోహాన్ $25,000 తీసుకన్నట్లు సమాచారం.
ఇక లిండ్సే లోహాన్ విషయానికి వస్తే 2007వ సంవత్సరంలో డ్రగ్స్ తీసుకున్నటువంటి కేసులో లిండ్సేకు 120రోజులు జైలు శిక్షతోపాటు 480గంటల పాటు కమ్యూనిటీ సర్వీస్ చేయాలని కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











