చేతిలో ఖురాన్: ఆ హీరోయిన్ మతం మారుతోందా?

By Bojja Kumar

లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ హీరోయిన్ లిండ్సే లోహన్ ఇస్లాం మతం స్వీకరించిందా? లేక త్వరలో మతం మారబోతోందా? అనే సందేహాలు ఇపుడు హాలీవుడ్ సర్కిల్ లో హాట్ టాపిక్ అయింది. ఇటీవల ఆమె ఇంగ్లీషులోకి అనువాదం అయిన ఖురాన్ గ్రాంథాన్ని చేతిలో పట్టుకుని కనిపించినప్పటి నుండి ఈ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

క్యాథలిక్ మతస్తురాలైన లిండ్సే లోహన్ కు ముందు నుండి ఆధ్యాత్మిక భావాలు ఎక్కువే. ఇటీవల ఆమె బ్రూక్లీన్ లోని కమ్యూనిటీ సర్వీస్ సెంటర్ కు వచ్చిన సందర్భంలో ఆమె చేతిలో ఖురాన్ గ్రాంథాన్ని పట్టుకుని నడుకుంటూ వెలుతూ కనిపించింది. దీంతో రకరకాల సందేహాలు తలెత్తుతున్నాయి.

లిండ్సే లోహన్ పూర్వీకులు ఐరిస్, ఇటాలియన్ భిన్న సంస్కృతులకు చెందిన వారు. ఆమె క్యాథలిక్ గానే పెరిగింది. ఆమె ఖురాన్ ఫాలో కావడం వెనక ఓ కారణం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆల్కహాల్, డ్రగ్స్ నుండి దూరంగా ఉండటానికే ఆమె ఖురాన్ ఫాలో అవుతున్నట్లు టాక్.

Lindsay Lohan Snapped With Quran In Hand, Converting To Islam?

మత్తు పదార్థాలకు బానిసన...
సినిమా రంగంలో ఉండే వారికి సిగరెట్ స్మోకింగ్, మద్య పానం అనేది చాలా కామన్‌‍గా మారింది. ఒత్తిడిని తట్టుకోలేక కొందరు సిగరెట్ స్మోకింగ్, మద్యపానం లాంటి వాటికి బానిసలుగా మారుతున్నారు. మరికొందరు అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్‌ను సైతం అలవాటు చేసుకుంటున్నారు. అలాంటి వాటికి అలవాటైన వారిలో లిండ్సే లోహన్ ఒకరు.

గతంలో లిండ్సే లోహాన్ డ్రగ్స్ తీసుకొని జైలుకెళ్ళింది. డ్రగ్స్ అలవాటను వదిలించుకోవడానికి తర్వాత రిహాబ్ సెంటర్‌కి కూడా వెళ్లారు. ఇపుడు దురలవాట్లకు దూరంగా ఉండటానికి ఆధ్యాత్మిక దారులు వెతుక్కుంటోంది లిండ్సే లోహన్. లిండ్సే లోహన్ గురించిన ఇతర విషయాల్లోకి వెళితే...ఎప్పుడూ ఏదో ఒక సంచలనానికి పాల్పడుతూ పాపులారిటీ పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది లిండ్సే లోహన్. అప్పుడపుడూ నగ్నంగా అందాల విందు చేస్తూ ఉంటుంది. నగ్నత్వం అనేది ఆమెకు కొత్తేమీ కాదు. గతంలో ప్లేబాయ్ లాంటి మేగజైన్లపై న్యూడ్ ఫోజులు ఇచ్చింది. అభిమానులు ఆమెను ఆమెను శృంగార దేవతలా ఆరాదిస్తారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X