కేసు నిరూపణ ఐతే ఆసినిమాలో నటించే అవకాశం కోల్పోవాల్సి వస్తుందా?
మొన్నటి వరకు మాదక ద్రవ్యాలు తీసుకుందని రిహాబ్ లో ఉంచిన స్టార్ హీరోయిన్ లిండ్సే లోహాన్ రాబోయేటటువంటి సూపర్ మ్యాన్ సినిమాలో ఓ అత్యద్బుతమైన పాత్ర పోషించనున్నారని సమాచారం. వివరాలలోకి వెళితే సూపర్ మ్యాన్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఆయన చేసేటటువంటి అత్యద్బుతమైనటువంటి విన్యాసాలు, వింతలు. అలాంటి సూపర్ మ్యాన్‌ని కూడా లవ్‌లో పడేసేటటువంటి క్యారెక్టర్ లూయిస్ లేన్.. అదేనండీ మన సూపర్ మ్యాన్ హీరోయిన్.
ఐతే ఈ సూపర్ మ్యాన్ సినిమాలో లూయిస్ లేన్ క్యారెక్టర్ మాత్రం వేరే హీరోయిన్ చేస్తున్నారు. ఇక లిండ్సే లోహాన్ క్యారెక్టర్ విషయానికి వస్తే సినిమాలో చాలా కీలకమైనటువంటి క్యారెక్టర్ అని అంటున్నారు. సినిమా విడుదలైన తర్వాత లిండ్సే లోహాన్ యావత్ ప్రపంచం మొత్తం నీరాజనాలు పడుతుందని అన్నారు. ఇది ఇలా ఉండగా ఇటీవల లిండ్సే లోహాన్ మీద ఓ కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసు ఏమిటంటే సినిమా షూటింగ్ జ్యూయలరీ షాపులో జరుగుతున్న సమయంలో 2, 500 డాలర్లు విలువ కలిగినటువంటి నక్లెస్ దోంగతనం చేయబడింది. ఆనేరం లిండ్సే లోహాన్ మీద మోపబడింది. ఈకేసు కనుక లిండ్సే లోహాన్ చేసినట్లు నిరూపణ ఐతే మాత్రం తనకి సుమారు మూడు సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందని అధికారులు వెల్లడించారు.
సరిగ్గా ఇలాంటి సమయంలోనే తనకి సూపర్ మ్యాన్ సినిమాలో నటించే అవకాశం రావడం కూడా తన దరిద్రమని అమె అభిమానులు వాపోతున్నారు. అది కనుక లిండ్సే లోహాన్ మీద నిరూపణ అయినట్లేతే లిండ్సే లోహాన్ ఈసినిమా నుండి తప్పుకోవాల్సి వస్తుందని డైరెక్టర్ జాక్ స్నైడర్ చెప్పడం జరిగింది. ఇక త్వరలో నిర్మించనున్న సూపర్ మ్యాన్:మ్యాన్ ఆప్ స్టీల్ సినిమాలో సూపర్ మ్యాన్‌గా హెన్రీ కావిల్ నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











