కూతురువి భారీ మొత్తానికి అమ్మాలనుకున్న తండ్రి
హాలీవుడ్ నటి, గాయని లిండ్సే లోహన్ తండ్రి మైఖేల్ తన కూతురు, మాజీ భార్య దినా మధ్య జరిగిన గొడవను రికార్డు చేసి పబ్లిక్ చేసిన విషయం తెలిసిందే. కాగా సదురు వీడియోలను తొలుత అతను వివిధ టీవీ ఛానెళ్లకు అధిక మొత్తానికి అమ్మడానికి ప్రయత్నించాడట. కానీ వారెవరూ అతను అడిగిన మొత్తం చెల్లిచకపోవడంతో నిరాశచెందిన అతను ఆ వీడియోలను radaronline.com వారికి ఉచితంగా కట్టబెట్టాడంట. కానీ తన ఇంటర్యూకు మాత్రం డబ్బు చెల్లించాలని డిమాండ్ చేసాడట. దీనికి ఒప్పుకున్న సదురు సంస్థ ఈ వీడియోలను సొంతం చేసుకొంది.
కానీ మైఖేల్ మాత్రం ఈ వార్తలను ఖండిస్తున్నాడు. అసలు నేను డబ్బు డిమాండ్ చెయ్యలేదని వివరణ ఇచ్చుకున్నాడు. కానీ తన ఇంటర్యూకి డబ్బు చెల్లించార అంటే మాత్రం అవునంటూనే మాటను దాటవేస్తున్నాడు... తన వద్ద ఇలాంటి టేపులు చాలా వున్నాయని లిండ్సే డ్రగ్స్ ను వదిలేయడానికి చికిత్సకు వెళ్లకపోతే ఆ వీడియోలను బయటరపెడతానని అతను లిండ్సే ను బెదిరిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











