కొన్ని గంటల్లో ‘ఆస్కార్’ .... ఇండియన్ స్టార్‍‌పై బోలెడు ఆశలు!

దేవ్ పటేల్ కు ఆస్కార్ అవార్డు వస్తుందనే నమ్మకంతో ఉన్నారు ఇండియన్స్.

By Bojja Kumar

హైదరాబాద్: ప్రపంచ సినీ రంగంలో అత్యున్నతంగా భావించేది 'ఆస్కార్' అవార్డు. నటనా రంగంలో ఎంత ఎత్తుకు ఎదిగినా ఆస్కారం అందుకోక పోతే అదో వెలితిగానే భావిస్తాడు ప్రతి నటుడు. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా ఆస్కార్ వేడుక లాస్ ఏంజల్స్ లో మరికొన్ని గంటల్లో (భారతీయ కాలమానం ఫిబ్రవరి 27 ఉదయం) ప్రారంభం కాబోతోంది.

ఈ సారి జరిగే 89వ ఆస్కార్‌ అవార్డుల విషయంలో ఇండియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు కారణం 'లయన్' అనే మూవీ. ఇది హాలీవుడ్ సినిమా అయినప్పటికీ భారతీయ నేపథ్యంతోనే సాగుతోంది. ఈ చిత్రంలో హీరోగా మన ఇండియాకు చెందిన దేవ్ పటేల్ నటిస్తున్నాడు. గతంలో దేవ్ పటేల్ 'స్లమ్ డాగ్ మిలియనీర్' చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.

'లయన్' ఈ సినిమాకు ఇప్పటికే ఆరు విభాగాల్లో నామినేషన్లు దక్కించుకుంది. బెస్ట్ పిక్చర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, బెస్టర్ సపోర్టింగ్ యాక్ట్రెస్, బెస్ట్ ఒరిజినల్ మ్యూజిక్ స్కోర్, బెస్టర్ రైటింగ్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే, బెస్ట్ సినిమాటోగ్రఫీ విభాగాల్లో నామినేషన్స్ దక్కించుకుంది. దేవ్ పటేల్ కు ఆస్కార్ అవార్డు వస్తుందనే నమ్మకంతో ఉన్నారు ఇండియన్స్. దీంతోపాటు ఈ సినిమాకు ఎన్ని ఆస్కార్ అవార్డులు వస్తాయి అనే ఆసక్తి అందిరిలోనూ ఉంది.

రియల్ లైఫ్ స్టోరీ

రియల్ లైఫ్ స్టోరీ

రియల్ లైఫ్ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇండియన్ బోయ్ ‘షేరూ' జీవితం ఆధారంగా సినిమాను తెరకెక్కించారు. అనుకోని పరిస్థితుల్లో తప్పిపోయి అనాథగామారి చివరకు ఆస్ట్రేలియా చేరిన వ్యక్తి పెద్దయ్యాక తన కన్నతల్లిదండ్రులను ఎలా కలుసుకున్నాడు అనే నేపథ్యంలో సినిమా సాగుతుంది.

షేరూ... సారూగా మారి

షేరూ... సారూగా మారి

షేరూ ఆ పిల్లాడికి అసలు తల్లిదండ్రులు పెట్టిన పేరు. అయిదేళ్ల వయసులో షేరూ తప్పిపోయి కోల్ కతా అనాథాశ్రమానికి చేరుతాడు. కోల్‌కతాలోని ఓ అనాథాశ్రమంలో ఉన్న షేరూని ఆస్ట్రేలియాకు చెందిన దంపతులు జాన్‌, సూ బ్రెయిర్లేలు 1987లో దత్తత తీసుకున్నారు. సారూ బ్రెయిర్లేగా అతనికి పేరు పెడతారు. అలా భారత్‌ నుంచి ఆస్ట్రేలియాలోని టాస్మానియా రాష్ట్రం హోబార్ట్‌కు చేరుతాడు షేరూ.

రియల్ లైఫ్ వ్యక్తులు

రియల్ లైఫ్ వ్యక్తులు

సారూకు తాను భారతీయ నేపథ్యం ఉన్న వ్యక్తిని అని తెలుసు. పెద్దయ్యాక కాన్‌బెర్రాలో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చదివేటపుడు అతడికి భారతీయ విద్యార్థులు పరిచయమవుతారు. అప్పుడే తాను పుట్టిందీ భారత్‌లోనేనని వారితో చెప్పాడు. ఎక్కడ పుట్టలావు అని వారు అడగ్గా... ఆలోచనలో పడతాడు సారూ. తాను పుట్టిన ఊరు, తల్లిదండ్రుల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెడతాడు.

రియల్ సారూ బ్రెయిర్లే , రీల్ సారూ బ్రెయిర్లే

రియల్ సారూ బ్రెయిర్లే , రీల్ సారూ బ్రెయిర్లే

తనతల్లిదండ్రులను కలుసుకునే క్రమంలో సారూ ఏం చేసాడు? ఊహ తెలియని వయసులో ఊరికి దూరమైన అతడు చివరకు ఎలా తాను అనుకున్నది సాధించాడు అనేది సినిమా. సారూ తన జీవితానుభవాలతో రాసిన పుస్తకం ‘ఎ లాంగ్‌ వే హోమ్‌' ఆధారంగా ‘లయన్‌ సినిమా చిత్రీకరించారు. ఈ నెల 24న మనదేశంలోనూ ‘లయన్‌' సినిమా విడుదలైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X