థ్రిల్లర్ సినిమాలో పోర్న్ స్టార్ సరసన సెక్సీ బ్యూటీ
లాస్ ఏంజిల్స్, జూన్ 14: హాలీవుడ్ స్టార్ హీరోయిన్ లిండ్సే లోహన్ రచయిత బ్రెట్ ఈస్టన్ ఎల్లిస్ రచించినటువంటి థ్రిల్లర్ సినిమా 'ది కాన్యోన్స్' సినిమాలో ఆడల్ట్ ఫిల్మ్ స్టార్ జేమ్స్ డీన్ సరసన నటించేందుకు అంగీకరించింది. ఈ విషయాన్ని రచయిత బ్రెట్ ఈస్టన్ ఎల్లిస్ తన ట్విట్టర్ ద్వారా ఈ సినిమాలో నటించే తారాగణాన్ని ట్వీట్ చేశాడు.
రచయిత బ్రెట్ ఈస్టన్ ఎల్లిస్ తన ట్విట్టర్‌లో 'ది కాన్యోన్స్' జేమ్స్ డీన్, లిండ్సే లోహాన్ నటించనున్నారు. ఈ సినిమాలో క్రిస్టియన్, తారా పాత్రలను వీరిద్దరూ పోషించడం నాకు థ్రిల్లింగ్ గా ఉంది. నేను ఊహించినదానితో పోలిస్తే ఈ సినిమాకు పని చేసేందుకు నాకు మంచి మంచి తారాగణమే దొరికిందంటూ ట్వీట్ చేశాడు. జులైలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాకు ప్రముఖ డైరెక్టర్ పాల్ షూరాడెర్ దర్శకత్వం వహించనున్నాడు.
లిండ్సే లోహాన్ ప్రస్తుతం టివి ప్రాజెక్టు 'లిజ్ &డిస్క్' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. దీని తర్వాత జులై నుండి ప్రారంభం కానున్న 'ది కాన్యోన్స్' చిత్రం షూటింగ్‌లో పాల్గోంటారు. ఆ మధ్య కాలంలో లిండ్సే లోహాన్ డ్రగ్స్ తీసుకోని జైలు పాలు అవ్వడంతో పాటు పునరావాస కేంద్రానికి కూడా వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications











