రూల్స్ అతిక్రమించినందుకు బాయ్ ప్రెండ్ జైలుకి..
సింగర్ జెన్నిఫర్ లొపెజ్ డాన్సర్ బాయ్ ప్రెండ్ 'క్యాప్సర్ స్మార్ట్' కారు స్పీడ్‌గా నడిపి, ట్రాఫిక్ రూల్స్‌ని అతిక్రమించినందుకు గాను, 90 రోజులు పాటు జైలు జీవితం గడపాల్సిందిగా కొర్టు శిక్షను ఖరారు చేసింది. 42 సంవత్సరాలు వయసు కలిగిన 'క్యాప్సర్ స్మార్ట్'తో జెన్నిఫర్ లొపెజ్ గత కొంత కాలంగా డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఇక వివరాల్లోకి వెళితే 'క్యాప్సర్ స్మార్ట్' ట్రాఫిక్ రూల్స్‌ని అతిక్రమించి, గంటకు 100 మైల్స్ వేగంతో రాష్‌గా డ్రైవింగ్ చేయడం వల్ల ఈ నిర్ణయం తీసుకొవాల్సి వచ్చిందని అన్నారు. గతంలో గనుక చూస్తే 2004, 2006, 2007వ సంవత్సరాలలో సరైన లైసెన్స్ లేకుండా కారు నడపడం వల్ల ఎలక్ట్రానిక్ టోల్ ఛార్జీలు చాలానే చెల్లించిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ 'క్యాప్సర్ స్మార్ట్' గవర్నమెంట్‌కి $26,000 బకాయి చెల్లించాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











